తమిళనాట విజయ్ హీరోగా వచ్చిన 'మెర్సల్' సినిమాకి ప్రీ గా పబ్లిసిటీ చేసి పెడుతుంది బిజెపి ప్రభుత్వం. 'మెర్సల్' సినిమాలో ప్రభుత్వానికి వ్యతిరేఖ డైలాగ్స్ ఉన్నాయని... ఆ డైలాగ్స్ తీసెయ్యకపోతే ఊరుకోమని బెదిరించడంతో... 'మెర్సల్' నిర్మాత 'మెర్సల్' లో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వున్న డైలాగ్స్ ని తొలగిస్తున్నట్టుగా లిఖిత పూర్వకంగా రాసిచ్చేశాడు. అయితే 'మెర్సల్' లో బిజెపి ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపే విధంగా వున్న ఆ డైలాగ్స్ ను తియ్యొద్దని..... తమిళ ప్రజలతోపాటు విజయ్ అభిమానులు... సినిమా ఇండస్ట్రీలోని బడా స్టార్స్ 'మెర్సల్' సినిమాకి మద్దతు ప్రకటిస్తున్నారు. రజినీకాంత్, విశాల్ మొదలుగు తమిళ సినిమా పరిశ్రమ పెద్దలు 'మెర్సల్' సినిమాకి గట్టిగానే మద్దతు తెలుపుతున్నారు. అయితే 'మెర్సల్' సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి.... ఈ బిజెపి రచ్చ వలన 'మెర్సల్' మాత్రం కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ బాక్సాఫీసుని షేకాడిస్తుంది.
అయితే 'మెర్సల్' సినిమాకి మద్దతు ప్రకటించిన మరుసటి రోజే అంటే నిన్న.. 'మెర్సల్' సినిమాకి మద్దతు ప్రకటించగానే ఈ రోజు తమిళ హీరో ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడు హీరో విశాల్ నిన్న అంటే ఆదివారం 'మెర్సల్' సినిమాకి మద్దతు తెలుపగా.. ఈ రోజు అంటే సోమవారం సాయంత్రానికల్లా జీఎస్టీ అధికారులు విశాల్ ఇంటిపై, ఆఫీస్ పై దాడులు నిర్వహించింది. ఇప్పుడు తమిళనాట విశాల్ ఇంటిమీద నిర్వహించిన జీఎస్టీ దాడులు తీవ్ర చర్చనీయాంశమైనాయి.
బిజెపి ప్రభుత్వాన్నికి వ్యతిరేఖంగా వచ్చిన 'మెర్సల్' సినిమాకి మద్దతు ఇచ్చిన హీరో ఇంటి మీద జీఎస్టీ దాడులు నిర్వహించడమనేది ఇప్పుడు కోలీవడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి విశాల్ తోపాటు 'మెర్సల్' సినిమాకి చాలామంది స్టార్స్ మద్దతు ప్రకటించాడు. రజినీకాంత్ వంటి స్టార్ హీరో కూడా 'మెర్సల్' సినిమాని.. విజయ్ నటనను ట్విట్టర్ సాక్షిగా అభినందించిన విషయం తెలిసిందే.