మెగాహీరో భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా?

Update: 2017-09-30 05:00 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఆకాశాన్నంటాయి. ఊరు.. వాడా... గల్లీ గిల్లి మొత్తం బతుకమ్మ సంబురాల్లో తెలంగాణ పడుచులు మునిగితేలారు.బతుకమ్మ పాటలతో ఊరంతా హోరెత్తిస్తారు. ఆటపాటలతో తెలంగాణ పడుచులు ఈ బతుకమ్మ ఉత్సవాలని నిర్వహిస్తారు. ఈఏడాది కూడా నిజామాబాద్ ఎంపీ కవిత అడవీర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగింది. తెలంగాణ వచ్చినప్పటినుండి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా చేస్తున్న విషయం తెలిసిందే. దసరా శరన్నవరాత్రులకన్నా ముందే మొదలయ్యే బతుకమ్మ సంబురాలు విజయదశమి కన్నాముందే ముగుస్తాయి.. ఇక బతుకమ్మ ఉత్సవాలు చివరి రోజున ఈ బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని అదిరిపోయే లెవల్లో చేస్తున్నారు.

మెగా డ్యాన్స్.....

అయితే ఇప్పుడు ఈ బతుకమ్మ సంబురాల గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఈ బతుకమ్మ సంబురాల్లో మెగా హీరోగారి ఆయన భార్యతో పాటు పాల్గొని బతుకమ్మ పాటలకు డాన్స్ కూడా చేసాడు. ఆయనెవరో కాదు మెగా హీరో రామ్ చరణ్. రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలోని గిల్డ్ ఆఫ్ స‌ర్వీస్ సేవా స‌మాజ్ బాలిక నిల‌యంలో ఈ బతుకమ్మ సంబురాల్లో పాల్గొని ఆటపాటలతో ఎంటర్టైన్ చేసారు. అక్కడ సేవా స‌మాజ్ బాలికలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ అందర్భంగా రామ్ చరణ్, ఉపాసనలు చేసిన డాన్స్ వీడియో ని ఉపాసన తన సోషల్ మీడియా పేజీ లో షేర్ చేసింది. మరి ఆ వీడియోలో చరణ్, ఉపాసనలు ఆ బాలికలతో బతుకమ్మలు ఆడి వారిని ఉత్సాహపరిచారు.

Similar News