మెగాస్టార్స్ ఇద్దరిని అంతమాట అనేశాడేంటి

Update: 2017-09-01 08:00 GMT

బాలకృష్ణ తన 'పైసా వసూల్' కోసం పిచ్చగా, ఎనర్జిటిక్ గా ప్రమోషన్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ కి మత్తెక్కిస్తున్నాడు. పబ్లిసిటీ లో భాగంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలకృష్ణ ఇండియాలో నటీనటులు రాజకీయ రంగ ప్రవేశంపై, వారికి రాజకీయాల్లో ఉన్న మనుగడపై సంచలనంగా మాట్లాడాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి, బాలీవుడ్ మెగాస్టర్ అమితాబచ్చన్ రాజకీయాల్లోకి రావడంపైనా మాట్లాడి టాక్ అఫ్ ద టౌన్ అయ్యాడు.

రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో పీకేద్దామంటే అది అంత సులభంగా జరగదని... సినిమాల్లో చూపించినట్టు రాజకీల్లోకి ఈజీగా వచ్చేసి చక్రం తిప్పేసినట్టు నిజ జీవితంలో రాజకీయాల్లో రాణించడం అంటే అంత సులభం కాదంటూసెలవిచ్చాడు. సినిమా నటుల్లో రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది కేవలం రామారావు గారి వల్లే అయ్యిందని... బాలీవుడ్ లో అమితాబచ్చన్ ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో ఏం ఒరగబెట్టాడు. పార్లమెంట్ కి వెళ్లి ఆటో గ్రాఫ్ లు ఇవ్వడం తప్ప... అంటూనే టాలీవుడ్ లో చిరంజీవి ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో ఏం చేయగలిగాడు... రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదన్నాడు. ఆ విషయం తాను రాత పూర్వకంగా రాసిస్తానని మరి చెబుతున్నాడు.

అసలు సినిమా నటులెవరు రాజకీయాల్లోకి రావొద్దంటూ ఒక సలహా కూడా పారేసాడు. అలాగే మరి మీరు ఇటు సినిమాల్లో అటు రాజకీయాలను ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు... అలాగే మీరు ఎమ్మెల్యే గా హిందూపురానికి చేసిందేమిటి అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. దానికి బాలయ్య మా వంశం వేరు.... మా బ్లడ్ వేరు... దేనికైనా క్రెడిబిలిటీ ఉండాలి. సినిమా స్టార్ అనే టాగ్ ఒకటే సరిపోదు. అలాగే వేరే హీరోలు సినిమాల్లో చెబితే అది డైలాగ్.. కానీ నేను మాట్లాడేది మాత్రం సినిమాల్లోని డైలాగ్ కాదు. అసలు నేనేం మాట్లాడాలనుకున్నానో అది స్పష్టంగా మాట్లాడతా. అంతెందుకు నాకు ఎవరైనా నచ్చితే నమస్కారం పెడతా.. లేదంటే వాడు ఎలాంటి వాడైనా సరే కేర్ కూడా చేయను. నా నేచర్ అలాంటిది. మా నాన్న బ్లడ్.. నా సినిమాల క్యారెక్టర్ల ప్రభావం నా నేచర్‌కు కారణాలు అంటూ ఊదరగొట్టేసి సదరు యాంకర్ కి పిచ్చెక్కించేసాడు.

Similar News