మెగా హీరోల మల్టీస్టారర్?

Update: 2017-12-02 06:28 GMT

టాలీవుడ్ లో ఇదివరకు మల్టీస్టారర్ సినిమాలంటే హీరోలంతా పెదవి విరిచేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చిన్న, పెద్ద హీరోలు కూడా ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాల వెంట పడుతున్నారు. ఇప్పటికే రాజమౌళి స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఊహించని మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టి అందరిని షాక్ లో పడేసాడు. ఈ దెబ్బకి మిగతా హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎగబడతారనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో మొదలైంది.

అలాగే నితిన్ - శర్వా ల మల్టీస్టారర్ ఇప్పటికే ఫైనల్ కాగా... వెంకటేష్ కూడా మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీగా వున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మెగా హీరోలు మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. సాయిదరమ్ తేజ్.. వరుణ్ తేజ్ కలిసి ఈ మల్టీస్టారర్ లో నటించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయమై అటు సాయి ధరమ్ ఇటు వరుణ్ తేజ్ లు కూడా ఒప్పుకున్నారంటున్నారు. ఇక వీళ్ళ సినిమాని నిర్మించబోయే నిర్మాణ సంస్థ కూడా రెడీగానే ఉందట.

ఇక సాయి ధరమ్ - వరుణ్ తేజ్ లను డైరెక్ట్ చెయ్యబోయే దర్శకుడు మాత్రం ప్రస్తుతానికి ఫైనల్ కాలేదట. ఇకపోతే ఈ మెగా మల్టీస్టారర్ మాత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు.

Similar News