మెగా హీరోల పార్టీ... చూశారూ

Update: 2017-12-13 12:00 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చినంతమంది హీరోలు మారె ఫ్యామిలోనుండి వచ్చి ఉండరు. చాలామంది మెగా ఫ్యామిలీ హీరోలే సినిమాల్లో కనబడుతున్నారు. మెగాస్టార్ చిరు అనే వృక్షం నుండి పుట్టిన వీరంతా ఆయన నీడలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగారు. చిన్న పెద్ద హీరోలే కాకుండా వారి ఫ్యామిలీనుండి ఒక హీరోయిన్ కూడా వచ్చింది. చిరు కూతుళ్లు సినిమాల్లోకి హీరోయిన్స్ గా రాకపోయినా .. ఆయన పెద్ద కూతురు సుష్మిత మాత్రం చిరు సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తుంది.

ఇకపోతే నాగబాబు కూతురు నిహారిక మాత్రం యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా సెటిల్ అయ్యే పనిలో బిజీగా వుంది. అటు మెగా హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్... కొత్తగా చిరు చిన్నల్లుడు కళ్యాణ్ కూడా ఎవరి సినిమాల విషయంలో వాళ్ళు బిజీ లైఫ్ ని గడుపుతున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ మెంబెర్స్ కొంతమంది తాజాగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అందులో రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక ఇలా కొంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఆ పార్టీలోబాగా ఎంజాయ్ చేశారనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిక్స్ చూస్తుంటే అర్ధమవుతుంది.

ఇక రామ్ చరణ్ తన చెల్లి నిహారికతో తీసుకున్న సెల్ఫీ అయితే అదిరిపోయేలా వుంది. చరణ్, వరుణ్, నిహారిక ఇలా అందరూ ఆ పార్టీని ఎంతాగానో ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తుంది.

Similar News