చిరంజీవి తన 151 వ ప్రాజెక్ట్ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని మొదలు పెట్టడానికి ఇంకా డేట్ అంటూ ఫిక్స్ చెయ్యలేదు గాని ఆ సినిమా గురించి రోజు ఎదో ఒక వార్త మీడియాలో నానుతూనే వుంది. ఈ చిత్రంలో ఉయ్యాలవాడ లుక్ కోసం చిరంజీవి మేకోవర్ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే చిరు లుక్ చూస్తుంటే ఉయ్యాలవాడ కోసమే తన లుక్ మార్చేశాడనిపిస్తుంది. అయితే హీరోయిన్ కోసం ఎడతెగని ఉత్కంఠ కూడా కొనసాగుతూనే వుంది. ఇప్పటికే నయనతార తో చర్చలు జరిపి ఫైనల్ చేశారనే వార్త సోషల్ ఇండియాలో చక్కర్లు కొట్టినప్పటికీ నయనతార ఇంకా ఉయ్యాలవాడలో ఫైనల్ అవ్వలేదంటున్నారు.
ఇక ఈ చిత్రం మూడు భాషల్లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి లు ఉన్నారు. బాహుబలితో టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ వచ్చేసింది. అందుకే ఈ సినిమాకి ఇంటెర్నేషన్ స్థాయిలో క్రేజ్ రావాలంటే బాలీవుడ్ నటులకు ఉయ్యాలవాడ చిత్రంలో చోటివ్వాలని వారు ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. మరి అక్కడ బాలీవుడ్ జనాలకు ఉయ్యాలవాడ రీచ్ కావలి అంటే ఒక పెద్ద బాలీవుడ్ స్టార్ ని ఈ ఉయ్యాలవాడ కోసం దించాలనే ప్లాన్ లో వీరువురు కసరత్తులు ప్రారంభించారు.
అయితే బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ ని ఉయ్యాలవాడలో ఒక కీలక పాత్రలో నటింపజేస్తే సినిమాకి ఆటోమాటిక్ క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనతో చర్చించి ఉయ్యాలవాడ కోసం ఒప్పించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఉయ్యాలవాడ లో నటించే విషయమై అమితాబ్ కూడా సుముఖంగానే ఉన్నట్లు వార్తలైతే వస్తున్నాయి గాని ఈ విషయమై మెగా కాంపౌండ్ నుండి ఎటువంటి క్లారిటీ లేదు. మరి నిజంగానే అమితాబ్ ఉయ్యాలవాడలో నటిస్తే గనక ఆ సినిమాకి ఇప్పుడున్న క్రేజ్ 1000 రేట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరు, బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ లు కలిస్తే బాక్సులు బద్దలైపోవాల్సిందే అంటూ మెగా ఫ్యాన్స్ చంకలు గుద్దేసుకుంటున్నారు.