మెగా ఫామిలీ నుండి హీరోలెవరొచ్చినా చిరంజీవి సహాయం లేకుండా ఎదగలేకపోతున్నారు. ఏదో రామ్ చరణ్, బన్నీ లు మొదట్లో ఎలా వున్నా... ఇప్పుడు సొంతకాళ్ళ మీద సొంత క్రేజ్ తో సినిమాలు చేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం చిరంజీవిని నమ్ముకునే ఇంకా బండి లాగిస్తున్నారు. ఇక చిరంజీవి కూడా ఒకరు తమ్ముడు కొడుకు, మరొకరు చెల్లెలి కొడుకు, ఇంకొకరు బామ్మర్ది కొడుకు, ఇప్పుడు సొంత అల్లుడు. మరి చూస్తూ చూస్తూ వాళ్ళని అలా గాలికి వదిలేయ్యలేదు. అందుకే వీలైనంతవరకు వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు.
అందులోభాగంగానే ఆయా కుర్ర మెగా హీరోలు తమ సినిమాల ప్రమోషన్స్ కి మెగా స్టార్ చిరుని ఫుల్ గా వాడేస్తున్నారు. తమ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కో లేకుంటే... ఆడియో లాంచ్ లకు చిరు ని తీసుకెళ్లి తమ సినిమాలను ప్రమోట్ చేసుకునున్నారు వారు. కొన్ని రోజుల వరకు ఇలాంటి వాటిని చిరు భరించినా ఇప్పుడు మాత్రం ఒకరి సినిమా ఈవెంట్‌కి వెళ్లి మరొకరి దానికి వెళ్లకపోతే నొచ్చుకుంటారని చిరంజీవి ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లకి రానని చెప్పేసారట. అయితే సినిమాల విడుదలకు ముందు తాను ఎలాంటి సపోర్ట్ ఇవ్వను కానీ విడుదలైన తర్వాత మాత్రం ఆయా సినిమాలకి మాట సాయం చేస్తానని ఇటీవలే మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట కలిసినపుడు చిరు ఎటువంటి మొహమాటానికి పోకుండా చెప్పేశాడట.
సినిమా గనక విడుదలై విజయం సాధిస్తే.. ఆ సినిమాకి సంబందించిన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమాని ప్రమోట్ చేస్తానని చెప్పాడట చిరు. అందుకేనేమో తొలిప్రేమ, ఇంటిలిజెంట్ చిత్రాలు ఒక్క రోజు తేడాలో విడుదలై తొలిప్రేమ హిట్ కాగా... ఇంటిలిజెంట్ డిజాస్టర్ అయ్యింది. అందుకే తొలిప్రేమకి చిరంజీవి ప్రత్యేకంగా అభినందన సభ పెట్టి వరుణ్ తేజ్ కి శుభాకాంక్షలు తెలిపాడు. కానీ సాయి ధరమ్ ని గాలికి వదిలేసాడు. అయితే మెగా సపోర్ట్ కావాలంటే సాయి ధరమ్ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. లేకుంటే....