మెగా ప్రిన్సెస్ ముచ్చట్లు

Update: 2017-11-19 13:00 GMT

మెగా ఫామిలీ నుండి ఇప్పటికే అరడజన్ హీరోస్ టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యారు. ఏ పరిశ్రమలో లేనంతమంది మెగా ఫామిలీ కుర్రోళ్ళు తెలుగు ఇండస్ట్రీ కి అరంగేట్రం చేసారు. అయితే ఈ మధ్యే మెగా కాంపౌండ్ నుండి నాగ బాబు కూతురు కొణిదెల నిహారిక కూడా వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

నిహారిక ఫస్ట్ మూవీ 'ఒక మనసు' ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. అయితే రీసెంట్ గా నిహారిక దీనిపై స్పందించింది. ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన విజయం అందుకోలేము. మెగా ట్యాగ్ ఉన్నా కూడా.. కంటెంట్ ఉంటూనే వర్కవుట్ అవుతుంది. నా నటనలో కొంత మార్పు రావాలి.. దానికి కోసం నేను పెద్దనాన్న, అన్నయ్యలా దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటున్నాను అని వివరించింది.

ప్రస్తుతం తమిళ్ లో నటిస్తున్నాను అని తెలుపుతూ..మా ఇంట్లో అందరికి తమిళ్ వచ్చు కానీ నాకు రాదు. ఇప్పుడిపుడే మాట్లాడటం నేర్చుకుంటున్నాని తెలిపింది. నిహారిక తమిళ్ లో ఆరు నల్ల నాల్ పాతు సోల్డ్రెన్ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాలో నిహారిక కాలేజ్ గర్ల్ గా కనిపించనుంది.

Similar News