మూర్తిగారేమిటండి రెచ్చిపోయారు!!

Update: 2017-07-25 03:25 GMT

ఇప్పుడు టీవీ ఛానల్స్, సోషల్ మీడియా, వెబ్సైట్స్ ఎక్కడ చూసినా ఒకటే రగడ. సినిమా ఇండస్ట్రీనే సిట్ అధికారులు ఎందుకు డ్రగ్స్‌ కేసులో టార్గెట్‌ చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు పొలిటికల్ సైడ్ నుండి గాని, స్కూల్స్, కాలేజెస్ సైడ్ నుండి గాని ఎటువంటి కదలికలు లేని డ్రగ్స్ కేసు ముందుగా సినిమా ఇండస్ట్రీ పైనే పడడం కాస్త ఆశ్చర్యంగా వున్నా... మరొకవైపు మాత్రం ఎక్కడినుండో అక్కడినుండి ఈ కేసు ఖచ్చితంగా మొదలయ్యెదనే చెబుతున్నారు. అలాగే మొదట మీరు...మొదట మీరు అని నిందించుకుంటూ కూర్చోంటే అసలు తొలి అడుగు ఎక్కడ పడాలి? ఎవరికి వారు, ముందు రాజకీయ నాయకులని విచారించండి అని సినిమావారు, సినిమావారు బాగా పాపులర్‌ కాబట్టి వారి సంగతి మొదట చూడండి అని, ఎవరికి వారు మరొకరి మీదకు నెడుతూ ఉంటే మొదటి అడుగు ఎక్కడ నుంచి వేయాలి? మరికొందరు మీ అధికారులు, వారి పిల్లలే వాడుతున్నారు. మొదట మీ సంగతి మీరే చేసుకోండి.........అంటున్నారు.

కానీ సిట్ అధికారులు మాత్రం ముందుగా స్కూల్స్, కాలేజెస్ ని టార్గెట్ చేసినా కూడా యాక్షన్ తీసుకుంటున్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ నే. అయితే కేవలం ఇండస్ట్రీ మీదే ఎందుకింతగా ఫోకస్ చేశారని మొన్నటికి మొన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీడియా సాక్షిగా వాదించాడు. ఇక ఇప్పుడు తాజాగా సామాన్యంగా ఎవ్వరినీ విమర్శించని ఆర్‌.నారాయణమూర్తి కూడా మా సినిమా వారే కనిపిస్తారా? అని ప్రశ్నించడం ఓ బాధ్యతాయుతమైన ఆర్‌.నారాయణమూర్తి గారికి తగదు. స్కూళ్లకు వెళ్లే టీనేజ్‌ పిల్లలకి కూడా డ్రగ్స్‌ అందుతున్నాయంటే పరిస్థితిని తీవ్ర రూపాన్ని ఇది చూపిస్తోంది. మీకు మీ సినిమా వారి మీద అంత నమ్మకం ఉంటే.. వారందరినీ విచారించకండి....... వారు డ్రగ్స్‌ వాడినట్లు, లేదా సప్లై చేసినట్లు తెలిస్తే వారి తరపున నేను శిక్ష అనుభవించడానికి రెడీ అని ఆర్‌.నారాయణమూర్తి వంటి వారు సినిమా పరిశ్రమ తరపునవకాల్తా పుచ్చుకోవడం కరెక్ట్ కాదనే వాదన వినబడుతుంది.

మరి నారాయణ మూర్తి గారు కేవలం సినిమా వాళ్లనే ఇలా సిట్ ఆఫీసర్స్ ఎందుకు టార్గెట్ చేసి ఇండస్ట్రీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారంటూ..... మీడియా, సిట్ అధికారులు కలిసి సినిమాలు తీసే వాళ్లకే సినిమాలు చూపిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ డ్రగ్స్ వ్యవహారంలో సినిమా వాళ్లు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నట్లుగా భ్రమలు కల్పిస్తున్నారని.. పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులు.. రాజకీయ నేతలు.. వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ వాడుతున్నారన్నారు. వాళ్లందరిని వదిలేసి.. సినిమా వాళ్ల మీదనే ఫోకస్ చేయటం సరికాదన్నారు. మరి నారాయణ మూర్తి డ్రగ్స్ వ్యవహారంలో అనవసరంగా స్పందించారేమో అనిపిస్తుంది కదూ.

Similar News