మూడు సినిమాలు... ఆరేళ్ళు!!

Update: 2018-02-16 10:00 GMT

టాలీవుడ్ భారీ సెట్టింగ్ వేస్తూ సినిమాలను తెరకెక్కించే వాళ్లలో రాజమౌళి ముందున్నట్టే.... బాలీవుడ్ లో కూడా అలాంటి ఆర్ట్ క్రియేటివిటీ దర్శకుడు మరొకరు ఉన్నారు. అతనే పద్మావత్ అనే కళాకండాన్ని తెరకేకించి హిట్ కొట్టిన సంజయ్ లీలా బన్సాలి. చారిత్రక నేపథ్యంలోని కథలను తీసుకుని... ఆ చరిత్రని వక్రీకరించకుండా భారీ సెట్టింగులతో సినిమాలను తెరకెక్కించగల సమర్ధుడు సంజయ్ లీలా బన్సాలి. గతంలో దీపికా పాడుకొనే, రణ్వీర్ సింగ్, ప్రియాంక చోప్రాలతో తెరకెక్కించిన బాజీరావు మస్తానీ ఎంత సన్సేషనో... తాజాగా దీపికా పదుకొనె, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ ల పద్మావత్ కూడా అంతే సెన్సేషన్. పద్మావతీ చిత్రం విడుదలకు ముందు ఎంత క్రేజ్ సృష్టించిందో... విడుదల తర్వాత అంటే సెన్సేషన్ అయ్యింది.

మూడు చిత్రాలతో ముందుకు....

ఇకపోతే రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె ల ప్రేమ జంటతో రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాలను తెరకెక్కించిన సంజయ్ లీల బన్సాలి.... ఆ ప్రేమ జంటతో మరో మూడు చిత్రాలను తెరకెక్కించనున్నారనే న్యూస్ బాలీవుడ్ మీడియాలో హైలెట్ అయ్యింది. సంజయ్ లీల దర్శకత్వంలో దీపికా అండ్ రణ్వీర్ లు మూడు చిత్రాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ వినబడుతుంది. ఈ మూడు చిత్రాలకు సంబంధించి అప్పుడే ఈ ముగ్గురి మధ్య డీల్ కూడా కుదిరినట్లుగా వార్తలొస్తున్నాయి. దీపికా, రణ్వీర్ నటనకు ముగ్దుడైన సంజయ్ లీల ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

అందుకే ఫిదా అయ్యాడా?

అలాగే కేవలం నటనకు మాత్రమే కాకూండా వారికి ప్రొఫెషన్ పట్ల ఉన్న అంకితభావానికి కూడా ఆ దర్శకుడు ఫిదా అవడం వలెనే.... వారితో మళ్లీ కలిసి పనిచేయాలని సంజయ్ లీలా డిసైడ్ అయ్యారట. మరి రణ్వీర్ అండ్ దీపికాలు పద్మావత్ సినిమా షూటింగ్‌కు, ఆ చిత్రం విడుదలకు అడ్డంకులు ఎదురైనప్పుడు వారు ఎంతో సహనంతో సహకరించడం ఆ దర్శకుడికి పిచ్చ పిచ్చగా నచ్చేసి మరో మూడు సినిమాలకు వారిని ఒక ఆరేళ్ళ పాటు లాక్ చేసి పడేసాడంట..

Similar News