కేథరిన్ ఇప్పుడు కాస్త ఫామ్ లోకి వచ్చినట్టే కనబడుతుంది. ఈ ఏడాది కేథరిన్ 'గౌతమ్ నందా, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక' చిత్రాల్లో నటించింది. 'గౌతమ్ నందా'లో గోపీచంద్ పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ... ఆ సినిమా ప్లాపయినప్పటికీ అందులో కేథరిన్ చేసిన బికినీ షో ఆమెకి మంచి పేరునే తెచ్చిపెట్టింది. అలాగే రానా పక్కన మళ్ళీ సెకండ్ హీరోయిన్ గా 'నేనే రాజు నేనే మంత్రి'తో గ్లామర్ షో చేసిన కేథరిన్ ఆ సినిమాలో ఒక టీవీ ఛానల్ కి ఎండీగా నటించి మంచి మార్కులే వేయించుకుంది.
అలాగే 'జయ జానకి నాయ'కలో ఐటెం సాంగ్ లో కేథరిన్ వేసిన చిందులు, హాట్ డాన్స్ కూడా కేథరిన్ క్రేజ్ ని ఒక్కసారిగా పెంచేసాయి. ఆ సినిమాల ఛాన్సులతో ఎంతోకొంత క్రేజ్ సంపాదించిన కేథరిన్ కి ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కిందనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. తమిళంలో ప్రభుదేవా నిర్మాణంలో తెరకెక్కిన 'భోగాన్' చిత్రాన్ని రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. అయితే తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ లక్ష్మణ్ ఈ తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేసే భాద్యతను యువ దర్శకుడు పవన్ సాదినేనికి అప్పగించారట.
ఇకపోతే తమిళ వెర్షన్ లో నటించిన హన్సిక పాత్రకి తెలుగులో కేథరిన్ ని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఇక కేథరిన్ కూడా తమిళ్ వెర్షన్ లో హన్సిక పాత్ర నచ్చి తెలుగులో ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుందని అంటున్నారు. ఇక ఈ సినిమా అక్కడ హిట్ అయినట్టే ఇక్కడ తెలుగులో కూడా హిట్ అయితే కేథరిన్ దశ తిరిగినట్లే అంటున్నారు.