మురుగదాస్ - విజయ్ లు రంగంలోకి దిగుతున్నారు

Update: 2017-11-29 14:00 GMT

మహేష్ బాబుతో తమిళ దర్శకుడు మురుగదాస్ ఈ సంవత్సరం తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కించిన ‘స్పైడర్’ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా మురుగదాస్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. డిసెంబర్ నెల నుండి ఈ చిత్రం చిత్రీకరణ మొదలుకానుంది.

ఇటీవలే వివాదాల మధ్య విడుదలైన విజయ్ ‘మెర్సల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మురుగదాస్ – విజయ్ కలయికలో వచ్చిన ‘తుపాకీ’ , ‘కత్తి’ చిత్రాలు ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి. సామాజిక కోణంలో సాగే కథను కమర్షియల్ ధోరణిలో చెప్పడం మురుగదాస్ కు బాగా తెలిసిన విషయం. ఈ చిత్రంలో కూడా మరో సామజిక సమస్యను కథాంశంగా ఎంచుకున్నాడని సమాచారం..

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గిరిష్‌ గంగాధరన్‌ ఎంపికైనట్లు తెలుస్తుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఏఆర్‌ రెహమాన్‌ లేదా అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశముంది. 2018 సంవత్సరం దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తుంది

Similar News