ప్రభాస్ బాహుబలి విజయ దరహాసంతో ఇపుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రధానంగా నాలుగు భాషల్లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని సాహో చిత్రాన్ని దేశం మొత్తం దింపడానికి రెడీ అయ్యింది. అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో చేస్తున్నాడు. మరి సాహో తర్వాత ప్రభాస్ చిత్రం ఏమిటనే దాని మీద ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది.
అదేమిటంటే తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ కి తమిళంలో ఎంత క్రేజ్ ఉందొ ఇక్కడ తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. మురుగదాస్ కేవలం తమిళంలోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన దర్శకుడు. మరి నేషనల్ వైడ్ గా సినిమాలు చెయ్యడంలో సిద్ధహస్తుడైన మురుగదాస్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడని తెలియగానే ఆ న్యూస్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చేసింది.
అయితే మురుగదాస్ ఎప్పుడూ ఆయా భాషల్లో క్రేజ్ ఉన్న హీరోలతోనే చేసాడు గాని... నేషనల్ వైడ్ పేరున్న హీరోతో సినిమా చెయ్యలేకపోయాడు. అయితే ఇప్పుడు బాహుబలితో జాతీయ స్థాయిలో పేరు కొట్టేసిన ప్రభాస్, మురుగదాస్ కి బెస్ట్ చాయిస్ గా కనబడడంతోనే ఇపుడు మురుగదాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ... అందుకే ప్రభాస్ తో సినిమా చెయ్యడానికి మురుగదాస్ ఇంట్రస్ట్ చూపుతున్నాడంటున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించడానికి డైరెక్టర్ మురుగదాస్ భారీ ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ మాత్రం ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది.