భారతీయ చిత్రాలలో బాహుబలి కి మినహా ఇతర చిత్రాలకి కేవలం ఇండియా లో 300 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు కావటం అంటే ఆషామాషీ విషయం కాదు. దక్షిణాది నుంచి ఈ 300 కోట్ల క్లబ్ లో బాహుబలి మినహా ఇతర చిత్రాలేవీ చెరనప్పటికీ బాలీవుడ్ నుంచి మాత్రం ఖాన్ ల త్రయం లో ఇద్దరు ఖాన్ లు పోటా పోటీగా ఒకటికి రెండు సార్లు తమ చిత్రాలని ఈ క్లబ్ లలో నిలబెట్టారు. తొలిగా పి కే చిత్రంతో 300 కోట్ల రూపాయల క్లబ్ ని ప్రారంభించిన ఆమిర్ ఖాన్ తరువాతి కాలంలో తాను నటించిన దంగల్ చిత్రాన్ని కూడా భారీ వసూళ్లతో ఈ క్లబ్ లో చేర్చాడు.
ఆమిర్ ఖాన్ ప్రారంభించిన ఈ క్లబ్ లో ఆయనకంటే ఎక్కువ సార్లు రికార్డు సాధించిన హీరో సల్మాన్ ఖాన్. గత ఏడాది వరకు ఆమిర్ ఖాన్ వి రెండు చిత్రాలు కాగా ఈ క్లబ్ లో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయిజాన్, సుల్తాన్ రెండు చిత్రాలతో సల్మాన్ ఆమిర్ తో సమానం గా ఉండేవాడు. గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలైన టైగర్ జిందా హై దిగ్విజయంగా ప్రదర్షింపబడుతూ 16 వ రోజు ప్రదర్శనతో సల్మాన్ ఖాన్ ని ముచ్చటగా మూడవ సారి 300 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్ లో నిలబెట్టింది. భారత దేశంలో అత్యధిక సార్లు ఈ క్లబ్ లో మెంబెర్ గా సల్మాన్ కొత్త రికార్డు సృష్టించారు.