మొదట్లో సెప్టెంబర్ 29 లేదా 30 వతేదీన దసరా కానుకగా రావడానికి పూరీ-బాలయ్యల 'పైసావసూల్' వస్తుందని షూటింగ్ రోజే ప్రకటించారు. కానీ పూరీ అంటే సామాన్యుడుకాదు.. వేగంగా షూటింగ్‌తో పాటు ఒకే సమయంలో షూటింగ్‌లోనే స్పాట్ ఎడిటింగ్ చేయించడం, రెండు మూడు యూనిట్లతో జోరు పెంచడం పూరీజగన్నాథ్‌కి కొత్తేమీ కాదు. ఇక సినిమా అంటే దానికోసం రోజులోని 24 గంటలు బండ చాకిరి చేసి, అలసట లేకుండా చేయడంలో బాలయ్యది కూడా అదే స్టైల్.
ఇక 'పైసావసూల్'తో పాటు ఎన్టీఆర్ 'జై లవకుశ', మహేష్‌బాబు 'స్పైడర్'లు కూడా దసరా కానుకగానే వస్తాయని, దీంతో ఈ దసరాకి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ తప్పదని భావించారు. కానీ 'పైసా వసూల్' స్టెంపర్ రిలీజ్ కావడం, ఈ జంగిల్‌బుక్ పులికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కేవలం దసరా సెలవులలోనే కాదు.. ఎప్పుదొచ్చినా ఈ చిత్రం దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. దాంతో పూరీ మరింత వేగంగా పనిచేస్తున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏకంగా సెప్టెంబర్ 1న లేదా సెప్టెంబర్ 7లలో ఏదో తేదీన ఇట్స్ ఏ యాక్షన్ ఫిల్మ్ అంటూ మందుతాగిన మదగజంగా బాలయ్య వచ్చేందుకు సిద్దమవుతున్నారు.
ఇక సెప్టెంబర్ 1న బివిఎస్ రవి దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న 'జవాన్'ని విడుదల చేయాలని భావిస్తూ ఉన్నారు. ఇక ఇద్దరు మాస్ హీరోలైనా సరే బాలయ్యతో పోటీకి మెగామేనల్లుడు సిద్దం కాకపోవచ్చని, 'పైసా వసూల్' రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ అయితే ముందుగా రావాలా? లేక ఆ తేదీ కంటే ఓ రెండు వారాలు వెనకగా రావాలా? అనేది తేజు డిసైడ్ చేసుకునే వీలుంటుంది.