ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా? అది కూడా హీరోయిన్ అనుష్కనా? ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న టాప్ ట్రేండింగ్ న్యూస్. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పుడొక హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయాన్నీ ఎవరు స్ప్రెడ్ చేశారు అంటే... దుబాయ్ లో కూర్చుని సెన్సార్ బోర్డు మెంబెర్ అంటూ టాప్ స్టార్స్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేస్తూ.... వాటికి రేటింగ్ లు ఇచ్చేస్తూ హడావిడి చేసే ఉమైర్ సంధునే.... ఇప్పుడు ప్రభాస్ - అనుష్కలు అలెడ్రీ రిలేషన్ షిప్‌లో ఉన్నారని ఆయన అంటున్నారు. వారిద్దరి క్లోజ్‌ఫ్రెండ్స్ అని.... తనకు ఈ విషయం తెలిసిందని ఆయన చెబుతున్నారు. వారి ఇద్దరి మధ్య లవ్ పీక్ స్టేజీకి చేరిందని.... ఒకరి గురించి మరొకరు చాలా కేర్ తీసుకుంటారని... ఏదేదో ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ప్రభాస్, అనుష్కలు డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని కూడా ట్వీట్ చేశాడు.
మరి ప్రభాసేమో మా మధ్యన ఏం లేదంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. మరో పక్క అనుష్క ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసే వారిని హెచ్చరిస్తుంది. ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెబుతుంది. మరి వీరి పెళ్లి గురించి మధ్యలో ఈ ఉమైర్ సంధు గారి హడావిడి ఏమిటో మరి. అసలు ఉమైర్ సంధు ఏ సినిమా చూసినా అన్ని బావున్నాయంటాడు. మరి సినిమా విడుదల కాకుండానే సినిమాలకు రివ్యూలు ఇచ్చేస్తూ ఆ సినిమాలు సూపర్ అంటూ ఆకాశానికెత్తేస్తాడు. అసలు ఉమైర్ సంధు ఇచ్చే రివ్యూలను నమ్మి సినిమా కెళితే పరిస్థితి ఏమిటనేది మొన్న దసరాకి విడుదలైన కొన్ని సినిమాలే దానికి సాక్ష్యం. మరి దీన్ని బట్టి ప్రభాస్, అనుష్కల పెళ్లి విషయం కూడా ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఎంత కరెక్టో.... అనేది మీరే ఆలోచించండి.