ఫిలిం ఇండస్ట్రీని పైరసీ భూతం ఎంతగా వెంటాడుతుంది అంటే సినిమా విడుదలకు ముందే సినిమాని యూట్యూబ్ లో పెట్టేసి రాక్షసానందం పొందుతున్నారు కొందరు. మహామహులే ఈ పైరసీ భూతం నుండి తప్పించుకున్న ఆధారాలు లేవు. ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి సినిమా బాహుబలికి కూడా ఈ పైరసీ భూతం తప్పలేదంటే ఈ పైరసీ అనేది ఎంతలా పాతుకుపోయిందో తెలిసిపోతుంది. రాజమౌళి ఎమన్నా తోపా... ఆయన సినిమాలు పైరసీ కాకుండా ఉండడానికి అని మీరనుకోవచ్చు. తోపు కాదు తురుము కాదు. రాజమౌళి తాను తీసిన బాహుబలి ద బిగినింగ్ అప్పుడు తన సినిమా ఎక్కడ లీకైనా పట్టుకునేటట్టు సినిమా రీలపై ఒక మార్క్ వేసాడు. కానీ బాహుబలి ద కంక్లూజన్ విషయంలో ఏం జరిగిందో ఢిల్లీ లో ఈ పైరసీ చేసినట్లు తెరమీదకొచ్చింది.
ఇక ఇప్పుడు బన్నీ డీజే చిత్రం విడుదల రోజే కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని సీన్స్ పెట్టేసారు. కొన్ని ఫేస్ బుక్ ఎకౌంట్స్ ద్వారా ఈ డిజె పైరసీ కాపీని సోషల్ నెట్వర్క్ లో సర్కులేట్ చేస్తున్నారు కొంతమంది. ఇక హీరోయిన్ పూజ హెగ్డే సీన్స్ కూడా ఇలానే కాపీ చేసి ఫేస్ బుక్ లో పెట్టేసారు. పూజ బికినీ సీన్స్ ని ఇలా సోషల్ మీడియాలో పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి సినిమా విడుదల రోజే అలా జరగడంతో ఖంగు తిన్న డీజే చిత్ర దర్శక నిర్మాతలు అయిన హరీష్ శంకర్, దిల్ రాజులు సైబర్ క్రైమ్ వారికి కంప్లైంట్ చేశారట. మరి డీజే పైరసీ ఎక్కడ కనబడినా వారిని మాత్రం వదిలిపెట్టమని నిర్మాత దిల్ రాజు మీడియా పరంగా హెచ్చరికలు జారీ చేసాడు.
అలాగే టాక్ తో సంబంధం లేకుండా కాసుల వర్షం కురిపిస్తున్న దువ్వాడ జగన్నాథం చిత్రం ఇలా పైరసీ భూతం వెంటాడం అనేది పాపమే కదా..!