బాలీవుడ్ లో మేరీకోమ్ జీవితాన్ని ప్రియాంక చోప్రా హీరోయిన్ గా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఇప్పుడు లేడి క్రికెటర్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకుంటుంది. క్రికెటర్స్ జీవితాలను సినిమాలుగా మలుస్తూ హిట్స్ కొడుతున్న బాలీవుడ్ కింగ్ మేకర్స్ ఇప్పటికే ఎం ఎస్ ధోని బయో పిక్ ని, సచిన్ బయో పిక్ ని తెరకెక్కించి మంచి హిట్స్ సాధించాయి. మామూలుగానే క్రీడాకారుల జీవిత చరిత్రను సినిమాలుగా మల్చడమే పాపం ఆ సినిమా అలాంటి ఇలాంటి విజయం సాధించడంలేదు. బాక్సాఫీసుని షేక్ చేసి భయానకమైన కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి.
మిథాలి బయోపిక్......
అయితే ఇప్పుడు వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ వారు మహిళా క్రికెట్ లో 6వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక మహిళా క్రికెటర్ గా వెలుగొందుతున్న మిథాలీ రాజ్ బయో పిక్ కి శ్రీకారం చుట్టింది. ఆ విషయాన్ని మిథాలీ రాజ్ కూడా ప్రకటించింది. తన బయో పిక్ రూపొందబోతుందని... మిగతా విషయాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పింది. ఇకపోతే మహిళాక్రికేట్ లో కొత్త ఒరవడి సృష్టించిన మిథాలీ రాజ్ బయో పిక్ లో అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్ళబోతున్న సమంత నటిస్తుందని టాక్ వినబడుతుంది.
పెళ్లి తర్వాతే....
సమంత - నాగ చైతన్యల పెళ్లి తర్వాతే సమంత ఈ చిత్రంపై క్లారిటీ ఇస్తుందని కూడా ప్రచారం మొదలైంది. మరి మిథాలీ తెలుగమ్మాయి అయినప్పటికీ ఈసినిమాని బాలీవుడ్ లోనే తెరకెక్కిస్తారా లేదంటే అన్ని భాషల్లోనూ తెరకెక్కిస్తారా అనే క్లారిటీ రావాల్సిఉంది. అలాగే ఒకవేళ అన్ని భాషల్లోనూ తెరకెక్కిస్తే భాషకో హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారా? లేదంటే అన్ని భాషలకు ఒకే హీరోయిన్ ని తీసుకుంటారా? అనేది దానికి మీద క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మిథాలీ రాజ్ బయో పిక్ లో సమంత నటిస్తుంది అనేది కేవలం గాలివార్తే అంటూ కొందరు కొట్టిపారేయడం ఇక్కడ కొసమెరుపు.