టాలీవుడ్ లో టాప్ హీరోస్ ని పక్కన పెట్టి చుస్తే..మిడిల్ రేంజ్ హీరోస్ మాత్రం పది మంది పైనే వున్నారు. వీళ్ళ మధ్య పోటీ కూడా బాగా ఉందని చెప్పుకోవొచ్చు. అయితే ఈ స్థాయి హీరోల్లో అత్యంత నిలకడ చూపిస్తోన్నది మాత్రం నాని, శర్వానంద్‌లే. ఏ కొత్త దర్శకుడు అయినా వీళ్లతో సినిమా తీయాలనుకుంటాడు. నిర్మాతల సంగతి సరేసరి. వీరి డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు.
మంచి కథ ఉంటే చాలు.. వీళ్లకి చెప్పాకే.... వాళ్లు కాదంటే మిగతా హీరోస్ దగ్గరకి ఆ కథ వెళ్తుంది అంటే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి రేంజ్ ఆలా వుంది. అంతేనా వాళ్ల మార్కెట్ కూడా అలానే వుంది. వేగంగా సినిమాలు తీస్తూ వుంటారు కాబట్టి వీళ్ల కోసం నిర్మాతలు, దర్శకులు ఏడాది వేచి చూడడానికి కూడా వెనకాడడం లేదు. శర్వానంద్‌వి ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు రిలీజయ్యాయి. నాని సినిమాలు ఆల్రెడీ రెండు విడుదలయ్యాయి. మరొకటి డిసెంబర్‌లో రానుంది.
మంచి కథలుంటే నాని, లేదా శర్వానంద్ మాత్రమే దర్శకులకి గుర్తొస్తున్నారు. దీంతో మిగతా హీరోలు తమకి దొరికిన కథలు, మిగిలిన దర్శకులతోనే చేసుకోవాల్సి వస్తోంది. వీళ్ల సక్సెస్ రేట్ బాగుండటంతో.. మిగతా వాళ్లు దర్శకులు కోసం, కథలు కోసం తెగ తంటాలు పడుతున్నారు