'జెంటిల్ మెన్', 'నిన్ను కోరి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది నివేదా థామస్. చేసింది తక్కువ సినిమాలైనా మంచి పేరు వచ్చింది. దాదాపు అన్ని సినిమాలలో ట్రేడిషనల్ గానే కనబడింది నివేద థామస్. ఇంట ట్రెడిషనల్ గా ఉండే ఈ భామ.... స్టార్ హీరోస్ సరసన సూట్ కాదనే ముద్ర పడింది. ఎన్టీఆర్ తో చేసిన 'జై లవకుశ' సినిమాలో నటించినప్పటికీ గ్లామరస్ క్యారెక్టర్ కాకపోవడంతో ఆమెకి ఆ సినిమాలో అంతగా గుర్తింపు రాలేదు.
'జై లవకుశ' యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో నివేదాకి భారీ చిత్రాల్లో ఆఫర్లు రావడం లేదు. దీంతో లాభం లేదనుకుని తన లుక్ మార్చాలనుకుంది. ట్రెడిషినల్‌గా కనిపించే తన లుక్స్ మార్చుకుని స్టయిలిష్‌గా కనిపించేందుకు నివేద కృషి చేస్తుందట. నిత్యామీనన్‌లా తన కెరీర్ కూడా ఆలా అయిపోకూడదు అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నిత్య మీనన్ కూడా ఎప్పుడు ట్రెడిషనల్ గా ఉండడానికే ఇష్టపడి... గ్లామర్ పాత్రలను పక్కన పెట్టేసి... ఇపుడు తానే సినిమాల నుండి సైడ్ అవ్వడానికి రెడీగా వుంది.
స్టార్ హీరోల సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించగలిగితేనే ఏ హీరోయిన్‌కి అయినా లెంగ్తీ కెరీర్ వుంటుంది. అనుష్క, రకుల్, సమంత, కాజల్ మాదిరిగా ఈ బ్యాలెన్స్ చూసుకున్న వాళ్లే టాప్ స్టార్లు అయ్యారిక్కడ. ఈ ప్రయత్నంలో నివేదా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. ప్రస్తుతం ''జూలియట్ లవర్ అఫ్ ఇడియట్' అనే సినిమాలో నవీన్ చంద్ర సరసన నటిస్తుంది. ఈ చిత్రం విడుదలకి సిద్ధం అయ్యింది.