మా డాడీ ఇష్టపడలేదు

Update: 2017-12-25 11:00 GMT

హలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన కళ్యాణి.... మలయాళ లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ తనయురాలు అని తెలిసిందే. హలో సినిమాకి అఖిల్ పక్కన చాలా మందిని హీరోయిన్స్ గా అనుకున్నా లాస్ట్ కి మాత్రం కళ్యాణి ప్రియదర్శన్ నే ఫైనలైజ్ చేసారు నాగార్జున అండ్ విక్రమ్ కుమార్ లు. అసలు కళ్యాణి కి ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో మీకు తెలుసా.. అది కళ్యాణి మాటల్లోనే.

హలో చిత్ర కెమెరామన్ వినోద్ భార్యకు.. మా ఫ్యామిలీకి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. నాగార్జున గారు కూడా వాళ్లకి ఫామిలీ ఫ్రెండ్. సో ఆలా నన్ను ఈ సినిమాకి అఖిల్ పక్కన హీరోయిన్ గా రెకమెండ్ చేసారు. పేస్ బుక్ లో నా ఫొటోస్ చూసి నన్ను ఆడిషన్ కు పిలిచి నన్ను సెలెక్ట్ చేసారు.

విక్రమ్ కే కుమార్ నాగార్జున గారి చంద్రలేఖ టైం లోనే మా డాడీ దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేశారు. మరి డైరెక్ట్ గా మా డాడ్ విక్రమ్ గారికి చెబితే ఈ సినిమాకి తీసుకునేవారు. కానీ మా డాడ్ ఆలా చేయలేదు. నా అంతట నేను పేరు తెచ్చుకోవాలని.. వేరే దర్శకుల్ని ఇంప్రెస్ చేసి నటిగా రుజువు చేసుకోవాలని అనుకున్నారు. నాకంటూ ఒక గుర్తింపు వచ్చాక మా నాన్న దర్శకత్వంలో నటిస్తే నటించొచ్చేమో కానీ.. ఇప్పుడిప్పుడే ఆయనతో కలిసి పని చేయను అని చెప్పుకొచ్చింది కళ్యాణి.

Similar News