ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ విడుదలయ్యింది. అలాగే బుల్లితెర మీద వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ వన్ కూడా ఈ ఆదివారం రాత్రే పూర్తయ్యింది. మరి ఎన్టీఆర్ బుల్లితెర మీద చేసిన బిగ్ బాస్ హోస్టింగ్ కి అందరూ ఫీదా అయ్యారు. ఇక ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేసిందని... బిగ్ బాస్ ని వదిలి వెళుతున్నందుకు కొంచెం బాధగానే ఉందంటూ ఎమోషనల్ గా బిగ్ బాస్ స్టేజ్ మీద ఫీల్ అయినా విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా శివ బాలాజీని ప్రకటించే ముందు ఎన్టీఆర్ చేసిన పెరఫార్మెన్స్ మాత్రం సూపర్. ఎట్టకేలకు బుల్లితెర మీద బిగ్ బాస్ షో ఎటువంటి కాంట్రవర్సీకి చోటు లేకుండా చాలా చక్కగానే 70 రోజులు పూర్తి చేసుకుంది.
అయితే ఎన్టీఆర్ ప్రముఖ హెయిర్‌ఆయిల్ కంపెనీకి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ హెయిర్ ఆయిల్ ప్రమోషన్ లో భాగంగా మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎన్టీఆర్ ముచ్చటగా సమాధానాలు చెప్పాడు. అలాగే తన బిగ్ బాస్ జర్నీ గురించి కూడా మట్లాడాడు. ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ చాలా వెరైటీగా సమాధానం చెప్పాడు. అదేమిటంటే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో మీ అమ్మగారికి నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని అడిగితె..... దానికి ఎన్టీఆర్ నవ్వుతూ మా అమ్మకు నన్ను దాటి చూపు ఎక్కడికి వెళ్లదు..... అంతేకాదు మా అమ్మే అనుకుంటే.... మా ఆవిడ ప్రణతి కూడా మా అమ్మలాగే తయారైంది..... అంటూ హాస్యం పండించాడు.
ఇక ఇంతకుముందు చెప్పినట్టుగానే తన జీవితంలో తన తల్లి, భార్య ప్రణతి దొరకడం తన అదృష్టమని చెప్పాడు. అయితే మరో మీడియా ప్రతినిధి బిగ్ బాస్ సీజన్ వన్ ని సక్సెస్ ఫుల్ గా నడిపించిన మీరు బిగ్ బాస్ సీజన్ టు కి కూడా వ్యాఖ్యాతగా చేస్తున్నారా అని అడగగా... దానికి ఎన్టీఆర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే సందర్భం ఇది కాదంటూ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు.