మహేష్ సినిమా షూటింగ్ అప్ డేట్!

Update: 2017-10-30 13:00 GMT

స్పైడర్' సినిమా భారీ డిజాస్టర్ అయినప్పటికీ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ మీద అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. మహేష్ - కొరటాల కలయికలో వస్తున్నా 'భరత్ అనే నేను' పై భారీ అంచనాలు అభిమానుల్లో ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని చిరాన్ ఫోర్ట్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన సీఎం ఛాంబర్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారట.

ఈ సినిమాతో 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బాస్టర్ ని మళ్ళీ మహేష్ - కొరటాల అందుకోవాలని ఆరాటపడుతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని ముందుగా 2018 ఏప్రిల్ 20 న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇపుడు అదే నెల 27 న విడుదల చేస్తామని నిర్మాత డివివి దానయ్య అధికారంగా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి కాబట్టి ప్రీ రిలీజ్ బిసినెస్ భారీ స్థాయిలో జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Similar News