అఖిల్ కెరీర్ ఏమంటు స్టార్ట్ చేసాడో తెలియదు కానీ..మొదటి సినిమానే డిజాస్టర్ అయింది. అలానే రెండో సినిమా కూడా పాజిటివ్ టాక్ వచ్చినా ప్లాప్ గా నిల్చింది. హలో సినిమా ప్లాప్ అవ్వటానికి కారణం నాగ్ అని స్టోరీ నుండి డైరెక్షన్ వరకు అన్నిట్లో వేలు పెట్టడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయిందని టాక్ వుంది.
ఇంకా అసలు విషయానికి వస్తే అఖిల్ తన మూడో సినిమాపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవానికి అఖిల్ రెండో సినిమా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. చివరికి అఖిల్ మూడో సినిమా బాధ్యతలు స్వీకరిస్తానని వంశీ తెలపగా.. అందుకు నాగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇలా డీల్ కుదుర్చుకోవటంతో అఖిల్ హలో మూవీలోను.. వంశీ మహేష్ 25 మూవీలను బిజీ అయిపోయారు. కట్ చేస్తే హలో మూవీ రిలీజ్ అయ్యి చాలా కాలం అయిపోయింది. కానీ వంశీ ఇంకా మహేష్ సినిమా స్టార్ట్ కూడా చేయలేదు. ఈ మూవీ అయ్యేదాకా వంశీ ఏ ప్రాజెక్ట్ మీద ద్రుష్టి పెట్టడం లేదు..అంటే మహేష్ సినిమా అయిపోయేవరకు అఖిల్ వంశీ కోసం వెయిట్ చేయక తప్పదు.