మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల సినిమా షూటింగ్ లో బాగా బిజీగా వున్నాడు. గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్న మహేష్ కొద్దిపాటి విరామం కూడా తీసుకోకుండా భరత్ అనే నేను షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. పాపం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ చిత్రం కోసం ఎన్నోసార్లు తన డేట్స్ త్యాగం చేసి షూటింగ్ పూర్తి చేసిన్పప్పటికీ ఆ సినిమా ఇచ్చిన ఫలితంతో కాస్త నిరాశ పడ్డ మహేష్ ఈసారి కొరటాల సినిమతో హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు.
అలాగే కొరటాల సినిమా సెట్స్ మీదున్నపడే దర్శకుడు వంశి పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాక సినిమాని పూజ కార్యక్రమాలతో ప్రారంభించేసాడు కూడా. ఇక వంశి పైడిపల్లి కూడా సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడాని పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే లొకేషన్స్ వేట తో పాటె మూజిక్ సిట్టింగ్స్ ని కూడా పూర్తి చేసిన వంశీ పైడిపల్లి మహేష్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడట. ఊపిరి సినిమా తర్వాత వంశి పైడిపల్లి మహేష్ సినిమా స్క్రిప్ట్ మీదే కూర్చున్నాడు. మహేష్ అటు కొరటాల భరత్ అనే నేను సినిమాతో పాటే... ఇటు వంశి సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే యోచనలో ఉన్నప్పటికీ... కొరటాల షూటింగ్ లో బయటకెళ్లే ఛాన్స్ లేకపోవడంతో.. పూర్తిగా భరత్ అనే నేను మీద ఫోకస్ పెట్టి ఈ సినిమా షూటింగ్ ని సంక్రాంతికల్లా ఒక కొలిక్కి తెచ్చేసి వంశి సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట మహేష్.
ఇక మహేష్ కోసం వంశి వెయిటింగ్ అనే విషయాన్నీ ఆ చిత్ర బృందం లోని ఒకరు వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి పక్కా స్క్రిప్ట్ తో రెడీ అవుతాడు. మహేష్ సినిమాకు కూడా ఆ వర్క్ పూర్తయింది. ఎక్కడెక్కడ షూట్ చేయాలన్నది కూడా ప్లానింగ్ పూర్తయింది. కొరటాల శివ పని పూర్తవడం కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ చెబుతున్నాడు. ఇకపోతే కొరటాల సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తో రొమాన్స్ చేస్తున్న మహేష్ వంశి పైడిపల్లి సినిమాలో మాత్రం హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది