మహేష్ మేనల్లుడు కూడానా?

Update: 2017-11-27 09:00 GMT

నిన్నగాకమొన్న సూపర్ స్టార్ మహేష్ అక్క కూతురు అంటే మంజుల కూతురు జాన్వీ సినిమా రంగ ప్రవేశమంటూ వార్తలొచ్చాయి. అయితే అవి కేవలం పుకార్లు కావు నిజాలే అని ప్రూప్స్ కూడా బయటికి వచ్చాయి. అయితే ఇప్పుడు మహేష్ ఫ్యామిలీనుండి మరొకరు సినీరంగ ప్రవేశానికి రెడీ గా వున్నారు. మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హోదాలో ఉన్నాడు. మహేష్ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లో రాణించాలని ఆ ఫ్యామిలిలో చాలామందే కలలుకంటున్నారు.

అయితే ఇప్పుడు మహేష్ లాగా సినిమాల్లో వెలిగిపోవాలని మహేష్ మేనల్లుడు గల్లా జయదేవ్ కొడుకు అశోక్ కలలు కంటున్నాడు. గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉన్నాడు. హోదా పరపతి అన్ని ఉన్నాయి. అటు తండ్రి సపోర్ట్.. ఇటు మామయ్య మహేష్ సపోర్ట్ తో.. అశోక్ హీరో అవడానికి గల ట్రైనింగ్ ని ఎప్పటినుండో తీసుకుంటున్నాడు. అయితే అశోక్ తీసుకుంటున్న ఆ ట్రైనింగ్ ఒక కొలిక్కి వచ్చిందని.....అందుకే అశోక్ ని హీరో గా లాంచ్ చేసే ప్రయత్నాలు మొదలెట్టేశారట.

అయితే అశోక్ హీరోగా లాంచ్ చేసే బాధ్యతలు టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు చేతిలో పెట్టనున్నారనే టాక్ వినబడుతుంది. అయితే దర్శకుడి విషయంలో మాత్రం ఇంకా ఒక క్లారిటీకి రాలేదట. మరి మహేష్ ఫ్యామిలీ నుండి చాలామంది సినిమా రంగంలోనే ఉన్నారు. చాలామంది ఉన్నప్పటికీ వారు మాత్రం మహేష్ అంత హోద సంపాదించలేకపోయారు. మరి జయదేవ్ కొడుకు మహేష్ అంతటి వాడు అవ్వాలని ఆశిద్దాం.

Similar News