ప్రస్తుతం ఇండియా మొత్తం పాలిటిక్స్ వేడెక్కుతోంది. కరెక్ట్ గా ఇదే టైంలో మహేష్ బాబు సీఎం గా రాబోతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ ఓ పొలిటికల్ జోనర్ ఫిలిం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని ముందే రివీల్ చేశారు.
కానీ ఈ పాత్రలో మహేష్ ఎలా ఉంటాడు అని అందరు ఎదురు చూసారు. నిన్న రిలీజ్ చేసిన టీజర్ లో మహేష్ ఎలా ఉంటాడో తన పాత్ర ఏంటో రివీల్ చేసారు. పొలిటికల్ జోనర్ లో వచ్చే సినిమాలు అన్ని కరెంటు ట్రెండ్ కు కనెక్టయ్యేలా ఉంటేనే బాగా ఎక్కుతాయి. భరత్ అనే నేను టీజర్ చూస్తే అదేదారిలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది.
ఈ సినిమాలో పొలిటికల్ పంచులు బాగానే పడ్డాయి. అలానే సినిమాలలో కూడా ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ పైన పంచులు భారీగానే ఉన్నాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. వరస ప్లాప్స్ తో నిరాశగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ ఈ టీజర్ తో ఊరట లభించింది. ఈ నెలలో సినిమా కంప్లీట్ చేయనున్నారు. ఏప్రిల్ 20 నా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.