మహేష్ బాబు నిర్మాతల పాలిట ఒక వరం. ఎందుకంటే తన సినిమా విషయంలో ఏమన్నా తేడా వస్తే సినిమా నిర్మాతలకు అండగా ఉంటాడనే టాక్ వుంది. ఇంతకుముందు బ్రహ్మ్మోత్సవం సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి కష్టాల్లో ఉన్నప్పుడు తన పారితోషకంలో కొంత నిర్మాతకు ఇచ్చి ఆదుకున్నాడు. అప్పట్లో మహేష్ నష్టాల్లో ఉన్న నిర్మాతను ఆడుకున్నాడంటూ గొప్పగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కూడా మహేష్ తన నిర్మాతను ఆడుకున్నాడంటూ కథనాలు వెలువడుతున్నాయి.
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన స్పైడర్ చిత్రం నెగెటివ్ టాక్ తో ప్లాపుని మూటగట్టుకుంది. ఇక సినిమా ఘోరంగా ప్లాపవ్వడంతో మహేష్ మళ్ళీ తన వంతు సాయాన్ని స్పైడర్ నిర్మాత కి అందించాడట. స్పైడర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌కి తాను తీసుకున్న పారితోషికంలో నాలుగోవంతు తిరిగి ఇచ్చేస్తానని మహేష్ మాట ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన స్పైడర్ కోసం మహేష్ బాబు దాదాపు గా 23 కోట్ల పారితోషకం తీసుకున్నాడని న్యూస్ ఉంది. మరి సినిమాకోసం ఏడాదిన్నర కష్టపడినప్పటికీ.... సినిమా ప్లాప్ తో సంబంధం లేకపోయినప్పటికీ మహేష్ పెద్దమనసుతో స్పైడర్ నిర్మాతను ఆదుకోవడానికి ముందుకు రావడం విశేషమే.
మరి వరుసగా రెండు అతిపెద్ద భారీ ప్లాపులు రావడంతో మహేష్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఇక ఆ ప్లాపుల పరంపర అనేది భరత్ అనే నేను దాని మీద పడకుండా మహేష్ ఈ చిత్రానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఎలాంటి పొరబాట్లు ఈ చిత్రానికి జరగకుండా మహేష్ బాగానే జాగ్రత్త పడుతున్నదంటున్నారు.