'భరత్ అనే నేను' సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న కైరా అద్వానీ మహేష్ బాబుపై పొగడ్తలు వర్షం కురిపించింది. బాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్స్ లో కైరా ఒక్కరు. అటువంటి బాలీవుడ్ క్వీన్ మన టాలీవుడ్ ప్రిన్స్ ని తెగ పొగిడేసింది. 'భరత్ అనే నేను' సెట్స్ లో ఉదయం నుండి రాత్రి వరకు ఎంత కష్టపడినా.. మహేష్ ఒక్క జోక్ వేస్తే చాలు అంతే సెట్స్ లో అందరు నవ్వులతో వారి కష్టాన్ని మర్చిపోతారు.
సెట్స్ లో మహేష్ చాలా జోవియల్ గా ఉంటారని.. చిన్న నుండి పెద్ద వరకు అందరిని ఒకేలా చూస్తారని చెప్పింది. సీన్స్ బాగా రావాలంటే అందరు బాగా నటించాలని.. అందరి షాట్స్ చక్కగా రావాలని అనుకునేవారిలో మహేష్ ఒక్కరు. అసలు నేను సౌత్ సినిమాలో నటిస్తాని ఊహించలేదని.. కొరటాల శివ గారు చెప్పిన సబ్జెక్టు నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పింది.
అలానే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో రామ్ చరణ్ హీరోగా.. బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్నానని చెప్పుకొచ్చింది కైరా అద్వానీ.