ఈ దసరాకు రెండు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా విడుదలై మిశ్రమ, డిజాస్టర్, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని థియేటర్స్ లో రన్ అయ్యాయి. సినిమాలు విడుదలకు ముందే విపరీతమైన బిజినెస్ లతో రెండు బడా సినిమాలైనా జై లవ కుశ, స్పైడర్ చిత్రాలు రికార్డులు సృష్టించాయి. హీరోల మీదున్న క్రేజ్ తో ఈ సినిమాలను బయ్యర్లు ఆలోచించకుండా ఎడాపెడా కొనేశారు. అయితే జై లవ కుశ కు మంచి కలెక్షన్స్, అంటే గ్రాస్ వచ్చినప్పటికీ షేర్ మాత్రం చాలా తక్కువ వచ్చింది. కారణమేమిటంటే జీఎస్టీ. జై లవ కుశ కలెక్షన్స్ మంచిగానే ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ మాత్రం అందుకోలేకపోయింది. మరి కలెక్షన్స్ పర్వాలేదనుకున్న జై లవ కుశాకే జీఎస్టీ ఇంతగా దెబ్బేస్తే డిజాస్టర్ టాక్ వచ్చిన స్పైడర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.
అసలు స్పైడర్‌కి వచ్చిన గ్రాస్ వసూళ్లే తక్కువ అనుకుంటే..... అందులో చాలా వరకు జిఎస్‌టి కింద పోతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక బిసి సెంటర్స్ లో సినిమా చూసే వాళ్ళు మాత్రమే కాదు కొనేవాళ్ళు తక్కువైపోయారు. ఈ జీఎస్టీ అమల్లోకొచ్చాక సినిమా బాగోలేదంటే ఇక ఆ సినిమాకి పెట్టిన డబ్బు మాత్రం వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. ఈ కారణంగానే సినిమాలు కొనే థర్డ్ పార్టీ వ్యక్తులు ఇదివరకటిలా థియేటర్స్ రైట్స్ తీసుకోవడానికి పెద్ద ఆసక్తి చూపడంలేదు. మరి ప్రస్తుతానికి విడుదలైన బడా సినిమాల పరిస్థితే ఈ రేంజ్ లో ఉంటె ఇప్పుడు రాబోయే భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి ఎలా వుండబోతుందో గాని.... ఇప్పుడు జీఎస్టీ ప్రభావం మాత్రం పవన్ అజ్ఞాతవాసి మీద పడుతుందనే టాక్ బయలు దేరింది.
పవన్ సినిమాని కొనడానికి వచ్చే బయ్యర్లంతా ఇప్పుడు స్పైడర్ లెక్కలు చూపించి బేరాలాడుతున్నారట. స్పైడర్ సినిమా టాక్ తో లెక్కలు తారుమారైతే సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఉదాహరణగా చూపిస్తున్నారట. ఇంతకుముందు పవన్ సినిమాకి పలికిన రేటు కన్నా తక్కువగా కోడ్ చేస్తూ బేరాలాడడమే కాదు... జిఎస్‌టిని మినిమైజ్ చేయడానికి టాక్స్ ని విడిగా వసూలు చేయాలని కొందరు బయ్యర్లు ఆలోచించడమే కాదు... ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. మరి మహేష్ స్పైడర్ దెబ్బకి బయ్యర్లకు భయం పట్టుకుని... ఆ భయాన్ని పవన్ సినిమాపై చూస్తున్నారంటున్నారు. ఏదైనా మహేష్ దెబ్బకి పవన్ మాత్రం అబ్బా అనేలా వున్నాడు.