వి వి వినాయక్ దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చెయ్యబోతున్నాడంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు గాసిప్స్ రూపంలో వస్తూనే ఉంటాయని కొన్నాళ్ళకి మహేష్ - వినాయక్ కాంబోలో సినిమా ఒక రూమరని అందరూ వదిలేశారు. కానీ వినాయక్ దర్సకత్వంలో మహేష్ నటించేవాడేనంట. కానీ వినాయక్ చెప్పిన కథ నచ్చక మహేష్ ఈ కథ కాదు మరో కథతో సినిమా చేద్దామని వినాయక్ ని పంపేసాడట. అయితే ఇదంతా నిజమే. ఇదే విషయాన్ని ప్రస్తుతం ఇంటిలిజెంట్ ప్రమోషన్స్ లో ఉన్న వినాయక్ మీడియాతో పంచుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మీడియాకి ఇంటర్వ్యూ లు ఇస్తున్న వినాయక్ మహేష్ తో సినిమా గురించి స్పందించాడు.
మహేష్ తో ఒక సినిమా చెయ్యాలని అనుకున్న మాట నిజమే అని... ఆదుకు తగ్గట్టే మహేష్ బాబుతో కథా చర్చలు కూడా జరిగినట్టుగా వినాయక్ చెబుతున్నాడు. కాకపోతే వినాయక్ చెప్పిన కథ అంతగా నచ్చని మహేష్ మాత్రం మరో కథ ని సిద్ధం చెయ్యమని.. అప్పుడు సినిమా చేద్దామని వినాయక్ కి చెప్పాడట. ఆ కథ నచ్చితే గనక తప్పకుండా సినిమా చేద్దామని వినాయక్ కి మహేష్ బాబు మాట కూడా ఇచ్చాడట. ఇక తొందరలోనే మహేష్ కోసం ఒక అదిరిపోయే కథను రెడీ చేసి ఆయన్ని డైరెక్ట్ చేస్తానని చెబుతున్నాడు దర్శకుడు వి వి వినాయక్.
మరి వినాయక్ ఇలా మహేష్ తో సినిమా ఉంటుంది అని చెప్పగానే మహేష్ అభుమానులైతే మాత్రం మహేష్ బాబు - వంశి పైడిపల్లి సినిమా పూర్తయ్యేసరికల్లా వినాయక్ మంచి కథతో మహేష్ ని కలుస్తాడు.. వంశి దర్శకత్వంలోని సినిమా పూర్తి కాగానే వినాయక్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తాడని హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతానికి మహేష్ కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను సినిమాలో నటిస్తుండగా ... తన 25 వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.