మహేష్ తో మరోసారి!!

Update: 2017-10-05 17:00 GMT

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పేస్తారు. రకుల్ బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన సినిమాల్లో నటించకపోయినా ప్రస్తుతానికి స్టార్ హీరోల పక్కన బెస్ట్ ఛాయిస్ గా కనబడుతుంది. అసలు రకుల్ కి అవకాశం వస్తే చాలు చిన్న లేదు పెద్ద లేదు ఏ హీరోతో అయినా సై అంటుంది. అయితే ఇప్పటివరకు అందరి హీరోలతో జోడి కట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క పవన్ తో మత్రమే నటించలేదు. మొన్నటివరకు మహేష్ పక్కన నటించలేదు అనుకున్నా... ఇప్పుడు స్పైడర్ తో ఆ కోరిక కూడా తీరిపోయింది.

లక్కీనే మరి.....

స్పైడర్ లో మహేష్ సరసన డాక్టరమ్మగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాతో తమిళంలో ను పాగా వేసింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కి మహేష్ సరసన మరోసారి అవకాశం లభించినట్లుగా వార్తలొస్తున్నాయి. కొరటాల శివతో మహేష్ చేస్తున్న భరత్ అనే నేను సినిమా పూర్తయ్యాక మహేష్... వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ సినిమాలో మహేష్ పక్కన రకుల్ ప్రీత్ కి అవకాశం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి అప్పట్లో మహేష్ సరసన బ్రహ్మ్మోత్సవంలో ఛాన్స్ మిస్సయినా ఆ తర్వాత మహేష్ తో స్పైడర్ లో నటించిన రకుల్ కి మళ్ళీ మహేష్ సరసన అంటే లక్కినే మరి.

Similar News