మహేష్ జాతకాల్ని నమ్ముతున్నాడా?

Update: 2017-12-01 10:00 GMT

టాలీవుడ్ లో కృష్ణ తర్వాత సూపర్ స్టార్ అంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు మహేష్ బాబు. మెగాస్టార్, పవర్ స్టార్ ఎలాగో.. సూపర్ స్టార్ అలా అన్నమాట. అయితే ఈ బిరుదులు హీరోలు తమకి తాము పెట్టుకున్న బిరుదులుకావు. హార్డ్ కొర్ ఫాన్స్ ఇలా తమ హీరోలకు బిరుదులూ తగిలించేస్తే... క్రమేణా హీరోల ముందు ఆ బిరుదు అలా ఉండిపోతుంది అంతే. అయితే ఇప్పుడున్న సూపర్ స్టార్ అనే బిరుదును ఇకపై కొనసాగించాలని మహేష్ బాబు అనుకోవడం లేదు. అవును.. మీరు విన్నది నిజమే.

సూపర్ స్టార్ స్థానంలో మరో పేరు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఇంత సడెన్ గా మహేష్ ఇంత మంచి పేరును వదిలించుకోవాలని చూడ్డానికి జాతకాలే కారణమని తెలుస్తోంది. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినబడుతుంది. బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయింది. స్పైడర్ సినిమా అంతకుమించి అనే రేంజ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దెబ్బకొట్టేసరికి జ్యోతిష్యుల వెంటపడ్డాడట మహేష్.

జ్యోతిష్కులు కూడా కిందామీదా పడి ఫైనల్ గా ఈ సూపర్ స్టార్ అనే బిరుదును తీసేయాలని మహేష్ కి తేల్చి చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి. దీంతో మహేష్ కూడా అటువైపు మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా టైటిల్స్ లో సూపర్ స్టార్ బదులు ఒమెగా స్టార్ అనే టైటిల్ ను పెట్టుకోవాలని మహేష్ భావిస్తున్నాడనే టాక్ వినబడుతుంది. అయితే మహేష్ బాబు తన కెరీర్ స్టార్టింగ్ లోనే ఈ ఒమెగా స్టార్ అనే పదాన్ని వాడాడు. మళ్లీ ఇన్నేళ్లకు అదే బిరుదుకు మొగ్గుచూపుతున్నాడన్నమాట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే.. భరత్ అనే నేను విడుదలవరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Similar News