మహేష్ కోసం హాట్ భామ దిగింది

Update: 2017-11-12 19:30 GMT

ఈ మధ్య కాలంలో స్టార్స్ మొత్తం అప్పుడప్పుడు గొంతు సవరించుకుంటూ .. తమలోని సింగింగ్ కళను ప్రదర్శించేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్ చేరిపోయారు. స్టార్ హీరోల్లో ఎన్టీఆర్, వెంకటేష్ వంటి వారు తమ గొంతుతో ఉర్రుతలూగిస్తుంటే.. హీరోయిన్స్ కూడా మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ బయలుదేరుతున్నారు. స్వాతి, రాశి ఖన్నా వంటి వాళ్ళు సింగింగ్ లో ఇరగదీస్తుంటే... ఇప్పుడు తాజాగా మరో గ్లామర్ భామ ఎంట్రీ ఇచ్చింది.

ఆ భామ ఎవరో కాదు హాట్ హాట్ అందాలతో ఆకట్టుకున్న తమిళ హీరోయిన్ ఆండ్రియా. ఇక ఆండ్రియా సింగర్ ఆవరమెత్తి పాట పాడింది ఎవరికోసమో తెలుసా .. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం. అసలు విషయంలోకి వెళితే సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకతంలో తెరకెక్కుతున్న భరత్ అను నేను సినిమాకు దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ సాంగ్ ని ఆండ్రియా తో పాడించలని దేవిశ్రీ అనుకోవడం... ఆమెను కలవడం... దానికి ఆండ్రియా ఒప్పుకోవడం జారిపోయాయట.

అసలు ఇదివరకే ఆండ్రియా గాయని కూడా. ఇక భరత్ అనే నేను సినిమాలో పాడిన ఆండ్రియా నేను దేవి శ్రీకి పెద్ద అభిమానినని.... దేవి సంగీత దర్శకత్వంలో పాడటం ఆనందంగా ఉందని చెబుతుంది.

Similar News