మహేష్ బాబు స్పైడర్ డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అయితే మహేష్ బాబు స్పైడర్ సినిమాతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నా గాని... భరత్ అనే నేను బిజినెస్ మాత్రం ఒక రేంజ్ లో జరుగుతుంది. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పూజ కార్యక్రమాలతో పాటే.. ప్రిప్రొడెక్షన్ పనులను కంప్లీట్ చేసుకున్న వంశీ పైడిపల్లి.. మహేష్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వనుందని ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు స్వయంగా చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ తానూ అశ్వినీదత్ తో కలిసి ఈ సినిమాని ఎందుకు నిర్మిస్తున్నాడో అనే విషయానికి క్లారిటీ ఇచ్చాడు.
ఇంతకీ విషయమేమిటంటే మహేష్ బాబుకి నిర్మాత అశ్విని దత్‌తో ఒక సినిమాకి కమిట్మెంట్ ఉంది. అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి కి దిల్ రాజుతో కమిట్మెంట్ ఉంది. ఆ విధంగా ఇద్దరి కమిట్మెంట్స్ ని పూర్తి చేసేలా దిల్ రాజు, అశ్విని దత్ ఈ విధంగా కలిసి మహేష్ సినిమా ని ప్రొడ్యూస్ చేస్తున్నారట. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని దిల్ రాజు చెబుతున్నాడు.