మహేష్ కోసం అంతమందా?

Update: 2018-03-19 05:24 GMT

ఇప్పటివరకు ట్రౌజర్స్, షర్ట్ లలో స్టైలిష్ సీఎం లుక్ లో భరత్ అనే నేను లో కనబడిన మహేష్ బాబు నిన్న ఉగాది సందర్భంగా విడుదలైన భరత్ అనే నేను పోస్టర్ లో పంచె కట్టు సీఎం లో అదరగొట్టేసాడు. మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో యంగ్ సీఎం గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్ అన్నిటీలో మహేష్ బాబు అందగాడిగా, సూపర్ స్టైలిష్ గా సీఎం లుక్ లో అదరగొట్టేయ్యగా నిన్న మాత్రం పంచె కట్టు లుక్ లో మహేష్ బాబు ఉన్నాడు చూడండి అబ్బబ్బా...అనేలా ఉన్నాడు. యంగ్ సీఎం గా సమాజానికి మంచి చేసే ఉద్దేశ్యంతో మహేష్ ఈ సినిమాలో అదరగొట్టనున్నాడు.

అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుతున్న ఈ సినిమా ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా కి సంబందించిన పాటల చిత్రీకరణ జరుగుతుంది. రాజు సుందరం నేతృత్వంలో ఓ పాట చిత్రీకరణ భారీ టెంపుల్ సెట్‌లో 100 మంది డ్యాన్సర్లు.... 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఎంతో గ్రాండ్ గా ఈ పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. మహేష్ బాబు - కైరా అద్వానీల మధ్యన ఈ రొమాంటిక్ పాట ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ సాంగ్ ని గ్రాండ్ లెవల్లో చిత్రీకరిస్తున్న చిత్ర బృందం ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగానే... ఈ నెల 25 స్పెయిన్‌ షెడ్యూల్ కోసం పయనమవుతుందట.

మరి మహేష్ కి అచ్చొచ్చిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ భరత్ అనే నేనుకి సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం వేసవి సెలవలు కానుకగా ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Similar News