మహేష్ కూడా స్టార్ట్ చేసాడు

Update: 2017-09-20 09:00 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ విడుదల ముచ్చట్లే ఉన్నాయి. అయితే మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం కూడా మరోక వారం రోజుల్లోనే థియేటర్స్ లోకి రానుంది. అయితే సినిమా విడుదలకు టైం దగ్గరపడే కొద్దీ సినిమాకి సంబందించిన పబ్లిసిటీ కార్యక్రమాలు గాని... సినిమాకి సంబందించిన వార్తలేవి మీడియాలో కనబడడం లేదు. కారణం ఛానల్స్, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా అంతా జై లవ కుశ ప్రమోషన్స్ తో నింపేస్తున్నారు. జై లవ కుశ రేపే విడుదలవుతుంది కాబట్టి ఈ సినిమా పబ్లిసిటీని ఒక రేంజ్ లో నిర్వహిస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే రోజూ మీడియాతో కలిసి హడావిడి చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.

ఇకపోతే వచ్చే వారం విడుదల కానున్న స్పైడర్ చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. కేవలం అభిమానులు, ప్రేక్షకులలోనే కాక మహేష్ స్పైడర్ చిత్రంపై మహేష్ కుటుంబంలో కూడా ప్రత్యేక ఆసక్తి ఉంది. మురుగదాస్ వంటి డైరెక్టర్ తో మహేష్ తెలుగు, తమిళంలో చేసిన ఈ సినిమాపై అందరిలోనూ విపరీతమైన ఆసక్తి ఉంది. ఇక మహేష్ కుటుంబానికి గాను ప్రత్యేకించి స్పైడర్ స్పెషల్ షో వెయ్యబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మహేష్ కుటుంబ సభ్యులు చాలా మందే ఉన్నారు. వారి కోసం స్పైడర్ స్పెషల్ షోకి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అది కూడా ఈ శని ఆదివారాల్లోనే స్పెషల్ షో వేస్తారనే టాక్ వినబడుతుంది.

ఇకపోతే మహేష్ చెన్నై అంటే తమిళంలోనూ స్పైడర్ సినిమాతోనే డైరెక్ట్ గా అడుగుపెడుతున్నాడు కాబట్టి అక్కడ కూడా సెలెబ్రటీస్ అందరికి ఒక స్పైడర్ స్పెషల్ షో వేస్తె ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా స్పైడర్ చిత్ర బృందం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే తమిళంలో ఈ స్పైడర్ స్పెషల్ షో ఐడియా మురుగదాస్ నుండి వచ్చినట్లుగా చెబుతున్నారు. చూద్దాం ఫైనల్ గా ఎక్కడెక్కడ స్పైడర్ ప్రీమియర్స్ జరుగుతాయో.

Similar News