మహేష్ - మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ దసరా బరిలో విడుదలకు ఎన్టీఆర్ 'జై లవ కుశ' కూడా రెడీ అయ్యింది. ఎన్టీఆర్ దసరా స్టార్టింగ్ లో సెప్టెంబర్ 21 న వస్తుంటే మహేష్ 'స్పైడర్' మాత్రం దసరా ఎండింగ్ సెప్టెంబర్ 27 న వస్తుంది. అయితే 'జై లవ కుశ' కొన్ని కారణాల వలన ఆడియో లాంచ్ వేడుకని రద్దు చేసుకుని పాటలను నేరుగా మార్కెట్ లోకి వదులుతుంది. అలాగే 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. అయితే మహేష్ 'స్పైడర్' చిత్రం తెలుగు, తమిళంలో గ్రాండ్ గా ఆడియోని జరపాలని ప్లాన్ చేసింది చిత్ర టీమ్.
అయితే ఇప్పుడు 'స్పైడర్' చిత్ర ఆడియో తెలుగులో క్యాన్సిల్ చేశారనే కథనాలు ప్రచారం అవుతున్నాయి. తెలుగులో మాత్రం ఆడియో ని క్యాన్సిల్ చేసినా తమిళంలో మాత్రం భారీ లెవల్లో చెయ్యాలనే ఆలోచనలో మురుగదాస్ అండ్ టీమ్ ఉన్నారట. అయితే టాలీవుడ్ లో ఈ మధ్యన ఆడియో వేడుకలను రద్దు చేసుకుని మరీ... సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తూ కొత్త ట్రెండ్ కి తెరతీసినట్టుగా మహేష్ కూడా ఇప్పుడు తన 'స్పైడర్' చిత్ర తెలుగు ఆడియోని క్యాన్సిల్ చేసాడట. అలాగే తమిళంలో ఆడియో జరిగే రోజు 'స్పైడర్' తెలుగు పాటల్ని మార్కెట్ లోకి విడుదల చేసి సెప్టెంబర్ 16 గాని లేకుంటే 17 న గాని 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరపాలనే యోచనలో ఉన్నారట.
ఇక 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో అదిరిపోయేలా నిర్వహించి ఆ తర్వాత 'స్పైడర్' పబ్లిసిటీ కార్యక్రమాలను పిచ్చెక్కించాలనే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక మహేష్ కి సంబందించిన 'స్పైడర్' సాంగ్ షూట్ కూడా పూర్తికావడంతో మురుగదాస్ మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద పూర్తి దృష్టి సారించాడట. ఇక ఈ చిత్రంలో ఎస్ జె సూర్య , భరత్ విలన్స్ గా నటిస్తుండగా... రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ కి జోడిగా నటిస్తుంది.