మహేష్ ఎంత సేపు సీఏం గా ఉంటాడు

Update: 2018-03-05 03:52 GMT

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్టర్ గా రూపొందుతున్న చిత్రం 'భరత్ అనే నేను’. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం. అయితే ఈ సినిమాలో మహేష్ ఎంతసేపు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు..సినిమా మొత్తం కనిపిస్తాడా అనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అయితే మహేష్ అంత ఎక్కువసేపు ఏమి ముఖ్యమంత్రిగా కనిపించడట. అతన్ని ఎన్నారైగా పరిచయం చేసి..లండన్ నేపథ్యంలో కథను నడిపించి.. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తారట. ఇండియా వచ్చాకా అనుకోకుండా మహేష్ సీఏం అవుతాడంటా. మొత్తంగా ఓ 30 నిముషాలు కనిపించొచ్చని సమాచారం.

కొరటాల తన ప్రతి సినిమాలో ఏదొ ఒక మెసేజ్ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. అలానే ఈ సినిమాలో కూడా ఓ గొప్ప సందేశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Similar News