ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే భారీ సినిమాల్లో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ఒక్కటి. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకున్నారు.
విడుదల తేదీ ఏప్రిల్ 27 దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ఎడతెరిపి లేకండా కష్టపడుతోంది. మహేష్ కూడా ఈ సినిమా కోసం గ్యాప్ తీసుకోకుండా కష్టపడుతున్నాడంట. అంతేగాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తికావాలని టీంను ఉరుకులు పరుగులు తీయించుతున్నాడట.
ఫిబ్రవరి నెలాఖరున పూణేలో, దాని తర్వాత 16 రోజులపాటు ఫారిన్లో షూటింగ్ జరుపుకోనుందీ చిత్రం. ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. ఇకపోతే కొరటాల - మహేష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది.