మహానుభావుడు కాపీనా?

Update: 2017-09-19 12:00 GMT

మారుతీ ఏ గ్రేడ్ సినిమాలతోనే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో మారుతి ట్రాక్ మార్చేశాడు. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించి బంపర్ హిట్ కొట్టాడు. నాని హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో మారుతి ఏ గ్రేడ్ దర్శకుడు అనే పదం నుండి తప్పించుకున్నాడు. అయితే ఆ సినిమా వచ్చిన కొత్తలోనే ఈ సినిమాని మారుతీ తెరకేక్కిన్చాడంటే ఎవ్వరూ నమ్మలేదు. ఆయన ఇంతమంచి కథతో ఇంత మంచి కామెడీ సినిమాని తెరకెక్కించడమా అంటూ దీర్ఘాలు తీశారు.

ఇక తర్వాత వెంకటేష్ హీరోగా బాబు బంగారం తెరకెక్కించగా ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు తాజాగా శర్వానంద్ హీరోగా మహానుభావుడు చిత్రంని తెరకెక్కించిన మారుతీ ఈ చిత్ర షూటింగ్ ని చడీ చప్పుడు లేకుండా కానిచ్చేశాడు. ఈ చిత్రం ఈ నెల 29 న దసరా కానుకగా విడుదల కాబోతుంది. భలే భలే మగాడివోయ్ చిత్రం వలె ఈ మహానుభావుడు చిత్రం కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. అయితే మహానుభావుడు ట్రైలర్ నిన్న రాత్రి అలా యూట్యూబ్ లో విడుదల చేశారో లేదో ఈ మహానుభావుడు సినిమాని మారుతి ఒక మలయాళం సినిమా నుండి కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం మొదలయ్యింది.

ఈ మహానుభావుడు చిత్రాన్ని మారుతీ మలయాళం సినిమా నార్త్ 24 కాథం అనే సినిమా స్పూర్తిగానో..... లేకపొతే అదే సినిమాను యాజిటీజ్ గా కాపీ కొట్టాడో... అంటూ ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నార్త్ 24 కాథం అనే మలయాళం సినిమా ట్రైలర్స్, క్లిప్పింగ్స్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసే మారుతీ ఇలా మహానుభావుడు చిత్రాన్ని తెరకెక్కించాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మారుతీ మాత్రం ఈ మహానుభావుడు లాంటి సినిమాలు అంటే ఓసిడి మీద ప్రపంచవ్యాప్తంగా అయితే సినిమాలు చాలానే వచ్చాయి.... కానీ వాటితో ఈ మహానుభావుడు సినిమాకి పోలిక ఉండదు అని చెప్బుతున్నాడు. చూద్దాం మహానుభావుడు సినిమా విడుదలయ్యాక ఆ సినిమాకి కాపీనా... లేదా అనేది.

Similar News