రెండు బడా సినిమాల్తో పోటీ పడి దసరాని క్యాష్ చేసుకోవాలనే తహతహా. ఎప్పుడూ పండగ సెంటిమెంట్ తో హిట్ కొడుతున్న శర్వానంద్ ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో బడా సినిమాలు బరిలో ఉన్నా లెక్కచెయ్యకుండా థియేటర్స్ లోకి దిగిపోయి అరాచకం సృష్టిస్తున్నాడు. జై లవ కుశ, స్పైడర్ లతో పోటీ కి సై అన్న శర్వానంద్ మహానుభావుడుతో హిట్ టాక్ కొట్టేసాడు. సినిమాలో ఎంత అయితే క్లీనింగ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారో అంతే క్లీన్ హిట్ కొట్టేసింది మహానుభావుడు. క్లీన్ ఎంటర్టైనర్ గా కలెక్షన్స్ లోను సునామి సృష్టిస్తున్నాడు.
విడుదలైన మొదటి షోకే హిట్ టాక్ తో దూసుకుపోతున్న మహానుభావుడు రెండు రోజుల కలెక్షన్స్ అదిరిపోయే లెవల్లో ఉన్నాయి. మొదటిరోజు దాదాపు 3 .55 కోట్ల రూపాయల షేర్ అలాగే ఏడు కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన మహానుభావుడు రెండో రోజు అదే జోరు కొనసాగించింది. రెండో రోజు కూడా విడుదలైన అన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఇరగదీసిందనే టాక్. ఇక రెండు రోజుల్లో మహానుభావుడు 6 .8 కోట్ల నుండి 7 కోట్ల రూపాయల షేర్ మరియు 13 .5 కోట్ల నుండి 14 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా సమాచారం అందుతుంది. శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధిస్తున్న చిత్రంగా మహానుభావుడు నిలిచిపోతుంది అంటున్నారు. చూద్దాం శర్వా ఫైనల్ ఫిగర్ ని ఎంత అందుకుంటాడో అనే విషయం.