నాగ్ అన్వేష్ దర్శకుడిగా తెరకెక్కుతున్న సావిత్రి జీవిత కథ మహానటి చిత్రం షూటింగ్ శరవేగంగానే జరుపుకుంటుంది. అయితే మహానటి సావిత్రి జీవితంలో చాలా ఎత్తుపల్లాలు, అలాగే చాలామంది ముఖ్య వ్యక్తులు కూడా ఉన్నారు. అటు నట జీవితంలోను, ఇటు వ్యక్తిగత జీవితంలోను సావిత్రితో జర్నీ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకే ఈ చిత్రంలోకి దర్శకుడు నాగ్ అన్వేష్ చాలామంది ఫెమస్ నటీనటులను తీసుకుంటున్నాడు. మహానటి పాత్రకి టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ ని... అలాగే సావిత్రి భర్త పాత్రకు మలయాళ నటుడు దుల్కర్ ని... మరో ముఖ్య పాత్రకి సమంతని, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, షాలిని పాండే ఇలా ఎంతోమంది నటులను తీసుకున్నప్పటికీ సావిత్రి నట జీవితంలోని ముఖ్యమైన ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలకు ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు.
అయితే సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ని, ఏఎన్నార్ పాత్రకి నాగ చైతన్య ని అప్రోచ్ అయినట్లుగా వార్తలొచ్చాయి. ఇక ఎన్టీఆర్ అయితే సీనియర్ ఎన్టీఆర్ పాత్రకి ఓకె చెప్పినట్లుగా కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు జై లవ కుశ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్.... తాను మహానటిలో తన తాతగారి పాత్రని పోషించడంలేదని... అసలు ఆ పాత్ర చెయ్యమని నన్నెవరూ అప్రోచ్ కాలేదని చెబుతున్నాడు. అసలు సీనియర్ ఎన్టీఆర్ గా నటించాలి అంటే చాలా కష్టమని... ఆ రోల్ నేనే చెయ్యాలి అనే రూల్ లేదు. ఎవరైనా నటించొచ్చు అని చెప్పాడు.
మరి ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలను మహానటిలో ఎవరు పోషిస్తారు అనేది ఇంకా సస్పెన్సు గానే వుంది. చూద్దాం ఫైనల్ గా ఆపాత్రల్లో ఎవరు కనబడనున్నారో...