మహానటికి స్టార్ట్ అయ్యిందిరోయ్...?

Update: 2018-02-19 08:02 GMT

కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్ అలనాటి మేటి తార మహానటి సావిత్రి జీవితాన్ని మహానటి టైటిల్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తియ్యడం కోసం తానెంతో శ్రమించి సావిత్రి గారి పర్సనల్ విషయాలతోపాటు.... నట జీవితానికి సంబందించిన విషయాలను తెలుసుకునే ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టానని చెప్పాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. మరి మహానటి సావిత్రి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగలేదనేది జగమెరిగిన సత్యం. నట జీవితంలోను, వ్యక్తిగత జీవితంలోను సావిత్రి ఎన్నో ఒడి దుడుకులు ఎదుర్కొంది కూడా. మరి అలాంటి నటి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించడమంటే కత్తి మీద సామే. మరి అలాంటి నటి గురించి ఏ విషయాన్ని చూపించాలన్న కూడా దానికి సంబందించిన అన్ని విషయాలు తెలుసుకుని తీరాలి... లేదంటే సినిమా విడుదల అప్పుడు అదే పెద్ద సమస్యై కూర్చుంది. మరి సినిమా ఇంకా విడుదల సమయం దగ్గర పడకుండానే మహానటి సినిమాపై ఒక సీనియర్ హీరోయిన్ అయిన నటి జామున సంచలన వ్యాఖ్యలు చేసింది.

అప్పట్లో సావిత్రికి బెస్ట్ ఫ్రెండ్ అయిన జమున ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో మహానటిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అందరికన్నా ఎక్కువగా తనకి సావిత్రి గారి గురించి తెలుసనీ... తాను ఆవిడని అక్కా అని పిలుస్తూ వాళ్ళింట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా ఉండేదానినని.. అలాంటి నన్ను ఈ సినిమా విషయమై ఎవరు సంప్రదించకుండానే మహానటి సినిమా చేస్తున్నారని.. అసలు తనని సంప్రదించకుండా ఈ సినిమాని ఎలా తీస్తారని ఆవిడ నాగ్ అశ్విన్ కి సూటిగా ప్రశ్న సంధించారు. సావిత్రి నటుడు జెమిని గణేష్ ని పెళ్లి చేసుకునే సమయంలో... జెమిని గణేష్ మంచి వాడు కాదని.. అతను అమ్మాయిల వెంట పడతాడని.. చెప్పినా వినకుండా సావిత్రి అతన్ని పెళ్లి చేసుకుని మోసపోయిందని.. మరి ఇలాంటి సంగతులన్నీ లోతుగా ఆలోచించే సినిమాని చెయ్యాలని ఆమె అన్నారు.

కోట్ల మూలుగుతున్న కూడా సావిత్రి మద్యానికి బానిసై అనాధలా మరణం కొని తెచ్చుకోవడం బాధాకరమని జమున గారన్నారు. అప్పట్లో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను సావిత్రిని అమెరికా చికిత్స కోసం పంపాలనే ప్రయత్నం ఆవిడ అనారోగ్యం వల్ల విఫలం కావడాన్ని కూడా ఆమె గుర్తుకు చేసుకున్నారు. అసలు తెలుగు భాష రాని అమ్మాయి సావిత్రి పాత్ర ఎలా చేస్తుందో.. అలాంటి హీరోయిన్ ని ఈ దర్శకుడు ఎందుకు తీసుకున్నాడో అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరి సినిమా విడుదలకు ముందే ఇలా ఉంటే... సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని కాంట్రవర్సీలు మొదలవుతాయో కదా...!

Similar News