అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమా గురించిన ఆసక్తికర విషయం వెలుగులోకొచ్చింది. నాగ్ అశ్విన్ దర్సకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. కీర్తి సురేష్ మహానటి లుక్ ఇప్పటికే లీకైంది. ఆ లుక్ లో కీర్తి మహానటిగా చేయగలదో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేసారు కొందరు. ఇక ఇప్పుడు తాజాగా మహానటిగా కీర్తి సురేష్ అసలు లుక్ బయటికి వచ్చింది. ఆ లుక్ లో కీర్తి సురేష్ మాత్రం అచ్చం సావిత్రిలాగానే కనబడుతుంది. సావిత్రి అలనాటి కాలంలో ఎలా ఉండేదో అలాంటి లుక్ లో కీర్తి ఒదిగిపోయినట్లుగా ఉంది.
మరి లుక్ పరంగా సావిత్రిని తలపించిన కీర్తి సురేష్ నటన పరంగా సావిత్రి లా చేయగలదో లేదో అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మరి ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూనే అద్భుతమైన నటనతో టాప్ హీరోయిన్ కుర్చీకి అతి చేరువలో ఉన్న కీర్తి సురేష్, సావిత్రి పాత్రకు 100 శాతం న్యాయం చేయగలదని కొందరి అభిప్రాయం. ఇప్పటివరకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేసిన కీర్తి నేను శైలజ, నేను లోకల్ వంటి చిత్రాలతోనే కాకూండా తమిళంలోనూ విజయ్ తో ఏజెంట్ భైరవ, అలాగే రెమో సినిమాలోనూ నటించి మెప్పించింది.
మరి కీర్తి ఇప్పుడు సావిత్రి పాత్రను చాలా తేలిగ్గా చెయ్యగలదనే అభిప్రాయాలను చాలా ఎక్కువ మందే వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో అచ్చం సావిత్రిలా ఉంటే మాత్రం.... ఆమెలా అందాన్ని అభినయించడం చేతకావొద్దు అంటూ దీర్ఘాలు తీస్తున్నారు.ఇక ఈ మహానటి చిత్రంలో సమంత ఒక ముఖ్యమైన పాత్రలో చేస్తుండగా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు నటిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు తాజాగా అర్జున్ రెడ్డి ఫెమ్ షాలిని పాండే కూడా మహానటిలో చేస్తుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది