మసాలాగాళ్లతో మాట్లాడడంట!!

Update: 2017-11-18 13:00 GMT

లాంగ్ గ్యాప్ తర్వాత సిద్దార్థ్ తెలుగులో చేసిన మూవీ 'గృహం'. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వెర్షన్ ఎప్పుడో విడుదలైంది. కానీ తమిళంలతోపాటే విడుదల కావాల్సిన తెలుగు గృహం ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చి... మంచి హారర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వీక్షించిన ప్రేక్షకులతోపాటే క్రిటిక్స్ కూడా గృహం సినిమాని హిట్ గా తేల్చేశారు. ఈ సినిమాకి తెలుగులో మంచి రివ్యూలు పడ్డాయి. అయితే సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన సిద్దార్థ్ టాలీవుడ్ తో తనకి ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు.

చెప్పుతో కొడతా....

తను తెలుగు లోదాదాపు 15 సినిమాలు చేశానని.... ఆ సినిమాల్లో ఎక్కువగా హిట్‌ సినిమాలే ఉన్నాయి అని అన్నాడు. అందుకే తనకు తెలుగు సినిమాల గురించి మాట్లాడే హక్కు ఉందని సిద్దార్థ్ చెప్పాడు. నేను స్పష్టంగా తెలుగు మాట్లాడగలను. ఒకప్పుడు నన్ను తెలుగు హీరోగానే చూసారు. అందుకే ఇంకెప్పుడైనా ఎవరైనా సిద్దార్థ్ కి తెలుగు సినిమాల గురించి మాట్లాడే హక్కు లేదని అంటే వాళ్ళని చెప్పుతో కొడతానని చాలా ఆవేశంగా మాట్లాడాడు. అయితే సిద్దు ఆవేదనకు కారణం ఉంది.

ఓ మై ఫ్రెండ్ రిలీజ్ సమయంలో....

అదేమిటంటే గతంలో సిద్దార్ధ్, హన్సిక, శృతి హాసన్, నవదీప్ నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమా రిలీజ్ టైం లో తెలుగు సినిమాల గురించి కాస్త నెగటివ్ గా మాట్లాడినందుకే సిద్దార్థ్ కి తెలుగు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని... ప్రచారం జరిగింది. తాను ఎలాంటి సినిమాలు చేస్తున్నానో చూడాలని..... అది తెలిసిన వాళ్లతో తాను మాట్లాడతాను తప్పితే.... మసాలా గాళ్లతో మాట్లాడానని ఘాటుగా స్పందించాడు సిద్దార్థ్. అయితే నేను అప్పట్లో తెలుగులో రియాలిటీకి తగ్గ సినిమాలు చేయడం లేదని మాత్రమే అన్నానని అంతకు మించి తెలుగు సినిమాల గురించి తప్పుగా ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చాడు.

Similar News