మళ్ళీ స్టార్ట్ చేసింది!!

Update: 2017-07-08 05:56 GMT

శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ సీరత్ కపూర్. ఆ సినిమా హిట్ అయినప్పటికీ ఆ తర్వాత సీరత్ కపూర్ కి అనుకున్న ఆఫర్స్ రాలేదు. అందుకే సీరత్ కపూర్ గ్లామర్ డోస్ పెంచేసేశానని చెప్పడానికి డైరెక్ట్ గా ఫొటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాలో వదిలింది.ఆ ఫోటో షూట్స్ అలాంటి ఇలాంటివికాదు. ఆ దెబ్బకి 'రాజుగారి గది 2 ' లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన సీరత్, రవితేజతో మరో సినిమాలో ఆఫర్ కొట్టేసింది. అంతేకాకుండా మెగా హీరో శిరీష్ పక్కన కూడా ఛాన్స్ కొట్టేసి షాక్ ఇచ్చేసింది.

బికినీ డ్రెస్ లతో హాట్ లుక్స్ తో మతులు పోగొట్టిన సీరత్ కి సినిమాల్లో అవకాశాలు పెరగగానే వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం ఆపేసింది. ఓహో సీరత్ సినిమాలతో బిజీగా వుంది అందుకే హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం ఆపేసిందని అనుకునే లోపు మళ్ళీ ఇపుడు తన అందాలతో మరోమారు రెచ్చిపోవడానికి రెడీ అయ్యింది. ఇప్పుడుకూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే మున్ముందు సీరత్ మరింతగా రెచ్చిపోతుందేమో చూద్దాం.

Similar News