బాలీవుడ్ షాహిద్ కపూర్ – మీరా రాజ్‌పుత్ జోడీ ఎంతబావుంటుందో అందరికీతెలిసిందే. ఈ జోడీకి ఓ పాపా మిషా ఉన్న సంగతి తెలిసిందే. షాహిద్ మరోసారి తండ్రవుతున్నాడన్న శుభవార్త ఇప్పుడు అభిమానులకు, బాలీవుడ్ మీడియాకి చేరిందని అంటున్నారు. షాహిద్ నటించిన 'బాద్‌షాహూ' ఫిలిం రిలీజ్‌కి రెడీ అవుతున్న వేళ ఇది నిజంగానే షాహిద్ కపూర్ కి డబుల్ ధమాకా అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే షాహిద్ భార్య మీరా తానూ బేబి బంప్‌తో ఉన్నట్టు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిందట. ఇక త్వరలోనే బుజ్జి మిషా కి తమ్ముడో.. చెల్లెలో వచ్చేస్తున్నారన్నమాట.