మళ్ళీ వచ్చేస్తుంది...!! .

Update: 2017-07-31 04:10 GMT

అంజలి అంజలి అనే సాంగ్ ఎంత ఫేమసో అందులో నటించిన బేబీ షామిలి అంతే ఫేమస్. బోలెడన్ని సినిమాల్లో బాలనటిగా నటించిన షామిలి చాలా కాలం వేడితెరకు దూరమైపోయింది. చాలా రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన షామిలి ఓయ్ సినిమాతో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బేబీ షామిలిగా బాగా ఆకట్టుకున్న అందాలా బేబీ షామిలి, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఆమెపై తెలుగు ప్రేక్షకులు బోలెడన్ని హోప్స్ పెట్టేసుకున్నారు. హీరో సిద్ధార్థతో ఓయ్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షామిలి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బాగా విఫలమైంది. ఫలితం ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు తెలుగులో మళ్ళీ రాలేదు.

అంటే ఒకే దెబ్బకి తెలుగు ప్రేక్షకులకు దూరమైనప్పటికీ కోలీవుడ్ లో మలయాళంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. కానీ పాపకి ఆ వుడ్స్ కూడా ఏ మాత్రం పేరు తీసుకురాలేకపోయాయి. అంటే బేబీ షామిలిగా ఆకట్టుకున్న షామిలి హీరోయిన్ గా మాత్రం విఫలమైంది. అయితే మళ్ళీ కొడితే గట్టిగా కొట్టాలని కాస్త బ్రేక్ తీసుకుని... మరీ తన లుక్ ని మార్చేసింది. ఆ మార్చిన లుక్ తోనే ఆ మధ్య ఫోటో షూట్ చేయించుకున్న షామిలి,బాగా సన్నగా స్లిమ్ గా మారిపోయింది.

అయితే షామిలి అలా ఫోటో షూట్ చేయించుకోవడానికి తన అక్క షాలిని భర్త అజిత్ కారణం అన్నారు. అజిత్, షామిలి ఫోటో షూట్ చేయించాడని వార్తలు అప్పుడు బాగా హల్చల్ చేశాయి కూడా. ఏది ఏమైనా ఇప్పుడు కొత్త లుక్ తో మళ్ళీ తెలుగుతెరకు రావడానికి రెడీ అయ్యింది. రెడీ అవడమే కాదు పవన్ సుందర్ డైరెక్ట్ చేస్తున్న ఒక తెలుగు సినిమాలో నాగ శౌర్య కు జంటగా నటించేస్తుంది షామిలి. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇక అమ్మడు ఇప్పుడు తెలుగులో మెరుపులు మెరిపించబోతుందన్నమాట.

Similar News