మళ్ళీ మెగా ఫ్యామిలీని కెలుకుతున్నాడు

Update: 2017-12-13 09:00 GMT

కొన్ని నెలల క్రితం రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ - మెగా ఫామిలీ కి మధ్య మాటల యుద్దాలు జరిగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పై చేసిన కామెంట్స్ పెను దూమారం రేపడం .. దానిపై నాగ బాబు కౌంటర్ ఇవ్వడం ఇదంతా తెలిసిందే. అయితే చానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో యండమూరి ఈ విషయంపై స్పందించారు. అసలు నేను ఆ రోజు అలా అనలేదని.. అది 5 సంవత్సరాల క్రితం చిత్రీకరించిందని - కొంత కాలం క్రితం అది వెలుగులోకి రావడంతో ఈ వివాదం చెలరేగిందని చెప్పారు.

అనంతపురం కి వెళ్లిన నేను అక్కడ వెనక బడిన గ్రామాలలో వున్న పిల్లలకి అర్ధం కావటానికి నేను వీళ్ళ పేర్లు చెబుతానని చెప్పారు. పవన్ కల్యాణ్ ను పొగిడానని - పవన్ అంటే గాలిని పీల్చి బ్రతికేవాడని - అంజనీ పుత్రుడని - ఆంజనేయుడని చెప్పానని అన్నారు. అయితే తన పూర్తి ప్రసంగాన్ని వదిలేసి సర్జరీలు చేయించుకున్న విషయాన్ని బాగా హైలైట్ చేశారని చెప్పారు. అయినా సర్జరీలు చేయించుకుంటే తప్పేంటి చాలా మంది ఇండస్ట్రీ లో చేయించున్నారు. తన వ్యాఖ్యలను పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. నేను ఎప్పుడు ఎవరో ఒకళ్ళ ఫీచర్స్ గురించి కామెంట్ చేస్తూనే ఉన్నానని చెప్పారు.

శ్రీదేవి ముక్కు ఆపరేషన్ సమయంలో కూడా తాను కామెంట్ చేశానని చెప్పారు.తన హెయిర్ స్టైల్ బాగుండాలని హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇలా చాలా మంది పై కామెంట్స్ చేశాను కానీ ఆ రోజు నాగ బాబు గారు ఎందుకు ఆలా రియాక్ట్ అయ్యారో నాకు అర్ధం కాలేదు అని అన్నారు. సర్జరీలు గురించి తాను పొరపాటుగా మాట్లాడానని అనుకోలేదన్నారు. అయితే అది తనకు సంబంధం లేని విషయమని ఇప్పుడు అనుకుంటున్నానని వాళ్ళు ఎలా పోతే తనకెందుకు అని అనిపిస్తోందన్నారు. అయితే యండమూరి వివరణ ఇచ్చిన సంగతి పక్కన పెడితే దానిని మెగా ఫ్యామిలీ - అభిమానులు ఏవిధంగా స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Similar News